Ads
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజన్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.
Video Advertisement
వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.
ఈ వారం ఇంటి నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి. మరి వాళ్ళెవ్వరు అనే దాని గురించి అంతా ఆలోచిస్తున్నారు. ఓటింగ్ లెక్కలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఫైమా కెప్టెన్ వలన ఈవారం సేవ్ అయ్యింది. మిగిలిన తొమ్మిది మంది కూడా ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. కానీ రాజ్ కి ఇమ్యూనిటీ వచ్చి సేవ్ అయ్యిపోయాడు. దానితో ఇంటి నుండి రేవంత్, ఇనయ, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డిలలో ఒకరు వెళ్లాల్సి వుంది.
ఓటింగ్స్ ప్రకారం చూస్తే ఎక్కువ ఓట్లు రేవంత్ కి పడుతున్నాయి. రేవంత్‌కి 26 శాతం ఓట్లు వస్తుండగా…. రెండో స్థానంలో ఇనయ సుల్తానా 25 శాతం ఓట్లతో వుంది. కీర్తి మూడవ స్థానం లో వుంది. శ్రీహాన్ నాల్గవ స్థానంలో ఉండగా.. రోహిత్ ఐదవ ప్లేస్ లో ఆదిరెడ్డి ఆరవ ప్లేస్ లో వున్నాడు. ఇక శ్రీసత్య అయితే ఏడవ స్థానంలో వుంది. ఆఖరున మెరీనా వుంది. దీనితో ఈవారం హౌస్ లో నుండి మెరీనా వెళ్ళిపోతుందని తెలుస్తోంది.
End of Article