Home Bigg Boss 6 telugu “నేను శైలజ” సినిమాలో నటించిన… ఈ బిగ్‌బాస్ తెలుగు-6 కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

“నేను శైలజ” సినిమాలో నటించిన… ఈ బిగ్‌బాస్ తెలుగు-6 కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Anudeep

బిగ్‌బాస్ తెలుగు సీజన్ రియాలిటీ షో 6 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున అక్కినేని తనదైన శైలిలో షోను ప్రారంభించారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి ఆరో కంటెస్టెంట్‌గా శ్రీ సత్య అడుగుపెట్టారు.

బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి శ్రీ సత్య. సీరియల్స్, ప్రోగ్రామ్స్, వెబ్ సిరీస్ లు అంటూ ప్రతిచోటా ఆమె సందడి చేస్తున్నారు.

biggboss sri satya acted in nenu sailaja movie
హీరో రామ్ పోతినేని నటించిన ‘నేను శైలజ’ చిత్రంలో ఈమె ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించారు. ఆ చిత్రం లో రామ్ మాజీ ప్రేయసిగా ఆమె కనిపిస్తారు. ఆ చిత్రంతోనే ఆమె టాలీవుడ్లో అడుగు పెట్టింది. ‘నేను శైలజ’ చిత్రంతో పాటు శ్రీ సత్య చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. తరుణం, అంతా భ్రాంతియేనా, లవ్‌స్కెచ్‌, రౌడీ గర్ల్‌ ఫ్రెండ్‌ మొదలైన వాటిలో నటించింది. అంతేకాదు! ‘తొందరపడకు సుందర వదనా’ అనే వెబ్‌ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకుంది.

bigg boss telugu 6 contestant played a small role in nenu sailaja movie
విజయవాడకు చెందిన శ్రీ సత్య మెడికల్ స్టూడెంట్. నటనపై ఆసక్తితో ఎంబీబీఎస్ వదిలేసి వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా కెరీర్‌ను బెటర్ చేసుకొన్నారు. మిస్ విజయవాడగా, మిస్ ఆంధ్రా టైటిల్స్ ను గెలుచుకున్నారు శ్రీ సత్య. 2018 లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది శ్రీ సత్య . ముద్ద మందారం సీరియల్ ద్వారా బుల్లితెరపైన కనిపించింది. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని సీరియల్స్‌లో నటించి మెప్పించింది.

biggboss sri satya acted in nenu sailaja movie
శ్రీ సత్య ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ చూపదు. యోగా, జిమ్‌, స్విమ్మింగ్‌ చేస్తుంటుంది. ఈ అమ్మాయికి జంతువులంటే చాలా ఇష్టం. కుక్కల్ని ఎంతో ఇష్టంగా పెంచుకుంటోంది. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌ అన్నా ఈమెకు ఎంతో ఇష్టం. నటనలో తనను తాను నిరూపించుకున్న శ్రీ సత్య ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 6లోకి అడుగుపెట్టింది. మరి, శ్రీ సత్య బిగ్‌ బాస్‌ హౌస్‌లో అందరికీ పోటీగా నిలిచి విన్నర్‌ అవుతుందో లేదో చూడాలి.

You may also like