Ads
బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలాగోలా పూర్తయింది. నామినేషన్స్ పెట్టి, ఓట్లు వేయించుకొని చివరికి ఎలిమినేషన్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. నిజానికి తొలివారంలో ఎవరి టాలెంట్ ఏంటో.. ఎవరి వ్యక్తిత్వం ఏంటో బయటపడే అవకాశం లేదు కాబట్టి.. మరో వారం హౌస్‌లో ఉండే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్.
Video Advertisement
ఈ సీజన్‌లో మొదటి రోజు నుంచే వాదనలు, గొడవలు ప్రారంభమయ్యాయి. రెండో వారం మొదటి రోజు నామినేషన్స్ నుంచే మొదలయ్యాయి. వాడి వేడి చర్చలు, కౌంటర్లు, సెటైర్లతో రెండో వీక్ నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఒక్కో కంటెస్టెంట్ ఒకరిని మాత్రమే నామినేట్ చెయ్యాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా తాము నామినేట్ చేసే వారి ఫోటో ఉన్న కుండను బావిలో పడెయ్యాలి అని చెప్పాడు.
రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్‌లు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రేవంత్, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, రాజశేఖర్, మెరీనా-రోహిత్, షానీలు నామినేట్ అయ్యారు.
అయితే ఎక్కువ మంది గలాటా గీతుని నామినేట్ చేశారు. ఆమె ప్రవర్తన సరిగా లేదని చురకలేశారు. దీంతో వాదోపవాదాలు గట్టిగానే నడిచాయి. ఈ డిస్కషన్స్‌లో ఆదిరెడ్డి-ఆరోహిల మధ్య జరిగిన డిస్కషన్ హైలైట్. ర్యాపో లేదని ఆదిరెడ్డిని ఆరోహి నామినేట్ చేయడంతో.. ఆదిరెడ్డి గట్టిగానే తిప్పికొట్టాడు.
అయితే తొలివారంలో నామినేట్ అయ్యి దాదాపు ఎలిమినేషన్ అంచుల వరకూ వెళ్లిన అభినయ శ్రీ ఈ వారం కూడా నామినేషన్‌లో ఉంది. అలాగే తొలివారంలో అత్యధిక శాతం ఓట్లు పొందిన రేవంత్ కూడా నామినేట్ అయ్యాడు.
చివర్లో బాలాధిత్య కెప్టెన్ అయిన కారణంగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో మీరు బయటకు వెళ్లరనే నమ్మకంతో షానీ, రాజశేఖర్‌లను నామినేట్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.
మరో వైపు ఈ సీజన్ లో తొలివారంలో ఎలిమినేషన్స్ లేకపోవడంతో.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.
End of Article