బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన సీరియల్ ‘కార్తీక దీపం’. ఇందులో నటీనటులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇలా ఏళ్లపాటు సీరియల్ హవా నడిచింది. ఇక చివరికి ఈ సీరియల్ కి ముగింపు పలికారు మేకర్స్. అయితే ఆ తర్వాత కార్తీక దీపం ప్లేస్ లో రాత్రి 7 .30 గంటలకి “బ్రహ్మ ముడి ” అనే సీరియల్ స్టార్ట్ అయింది. కార్తీక దీపం లాంటి స్టార్ సీరియల్ ప్లేస్ రావడంతో బ్రహ్మముడిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

Video Advertisement

 

 

బ్రహ్మముడి సీరియల్ లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘కావ్య’ పాత్రలో తన అందం అభినయంతో ఆకట్టుకుంటుంది దీపిక. అమాయకంగా, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిగా దీపిక నటన చాలా నేచురల్‌గా ఉంది. తమిళనాడుకి చెందిన దీపికకు తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్. తొలి సీరియల్‌తోనే బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ బుట్టబొమ్మ. తాజాగా ఆ సీరియల్ తో పాటు..తన గురించి కొన్ని విషయాలు ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు దీపికా.

brahmamudi serial heroine deepika about karthika deepam serial..

తమిళనాడులో పుట్టి పెరిగిన దీపిక మొదట న్యూస్ రీడర్‌గా పనిచేసింది. తమిళ సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకుంది. అయితే తాజా ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దీపిక. ” “2017లో నాకు తెలుగు సీరియల్‌లో ఓ ఆఫర్ వచ్చింది. ‘కార్తీక దీపం’ అనే సీరియల్ స్టార్ట్ చేస్తున్నామని ఇందులో బ్లాక్ మేకప్ వేసుకుని యాక్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అయితే నేను అప్పుడే ఒక తమిళ సీరియల్ కి సైన్ చేశాను. ఇక ఈ సీరియల్ ఒప్పుకుంటే షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వస్తుండాలి. నేను ఎప్పుడూ తమిళనాడు దాటి రాలేదు. సో.. కొంచెం టెన్షన్ పడ్డాను. అందుకే ఆ ఛాన్స్ రిజెక్ట్ చేశాను. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో మంచి అవకాశం వచ్చింది.” అని దీపిక రంగరాజు తెలిపారు.

brahmamudi serial heroine deepika about karthika deepam serial..

ఇప్పుడు అంత గొప్ప సీరియల్ స్లాట్ లో ‘బ్రహ్మముడి’ టెలికాస్ట్ కావడం ఆనందం గా ఉంది అని ఆమె తెలిపారు. కార్తీకదీపం అంచనాలను బ్రహ్మముడి సీరియల్ కచ్చితంగా అందుకుంటుందని.. కార్తీక దీపం సీరియల్‌ను బీట్ చేస్తుందని దీపిక ధీమాగా చెప్పింది. అయితే దీపిక రంగరాజు ‘కార్తీకదీపం’ సీరియల్ రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని ఫాన్స్ అంటున్నారు. ప్రేమీ విశ్వనాథ్ కాకుండా ఎవరు నటించి ఉన్నా ఈ సీరియల్ ఈ రేంజ్ లో హిట్ అయ్యేది కాదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.