Ads
2017 నుంచి దాదాపు ఆరేళ్లు కార్తీక దీపం సీరియల్ నిరంతరాయంగా ప్రసారం అయ్యి.. జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా అనేక రికార్డుల్ని క్రియేట్ చేసి.. బుల్లితెర బాహుబలిగా అవతరించింది. ఇందులో నటీనటులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సీరియల్ పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇలా ఏళ్లపాటు సీరియల్ హవా నడిచింది. ఇక చివరికి ఈ సీరియల్ కి ముగింపు పలికారు మేకర్స్.
Video Advertisement
అయితే ఆ తర్వాత కార్తీక దీపం ప్లేస్ లో రాత్రి 7 .30 గంటలకి “బ్రహ్మ ముడి ” అనే సీరియల్ స్టార్ట్ అయింది. కార్తీక దీపం లాంటి స్టార్ సీరియల్ ప్లేస్ రావడంతో బ్రహ్మముడిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. తాజా నివేదికల ప్రకారం ‘బ్రహ్మముడి’ ప్రీమియర్ ఎపిసోడ్.. ‘కార్తీక దీపం’ సీరియల్‌కు వచ్చినట్లే మంచిగా రేటింగ్‌ను సాధించింది. అయితే ఆ తర్వాత దాని వీక్షకులు తగ్గినట్టు తెలుస్తోంది. నాలుగో వారంలో బ్రహ్మముడి సరాసరి రేటింగ్ 8.82గా ఉంది.
సాధారణంగా కొత్తగా లాంచ్ అయినా సీరియల్స్ కి ఇలా జరగడం మామూలే.. కొద్ది వారాలు గడిచి.. కథ ముందుకు సాగిన తర్వాత సీరియల్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ‘కార్తీక దీపం’ అంచనాలను తట్టుకొని ‘బ్రహ్మముడి’ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. మధ్యతరగతికి చెందిన తన ముగ్గురు కుమార్తెలను.. గొప్పింటి కోడళ్లను చేయాలనుకొనే ఒక తల్లి ఆరాటం ఇందులో మెయిన్ పాయింట్. అలాగే హీరోయిన్ కావ్య ఒక పెయింటర్.. హీరో బిజినెస్‌మెన్. వీరిద్దరి భవితవ్యం ఎలా ముడిపడింది అన్న కథాంశంతో సీరియల్‌ను తెరకెక్కించారు.
‘బ్రహ్మముడి’లో మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మానస్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న వ్యక్తే. ‘కోయిలమ్మ’ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. ‘కార్తిక దీపం’లో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అలాగే కావ్య కూడా తమిళ సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు బ్రహ్మముడితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5, బిగ్ బాస్ నాన్-స్టాప్ ఫేమ్ హమీదా కూడా ఈ సీరియల్‌లో మంచి పాత్ర పోషిస్తోంది. హమీదాకు ఇదే తొలి సీరియల్.
End of Article