ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదని ఆ రైతుని బస్సు ఎక్కించుకోని డ్రైవర్..ఆఖరికి ఏమైందంటే..?

ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదని ఆ రైతుని బస్సు ఎక్కించుకోని డ్రైవర్..ఆఖరికి ఏమైందంటే..?

by Megha Varna

Ads

అన్నదాతలు లేకపోతే మనకి బతుకే లేదు.. అయితే చాలా మంది రైతులను చిన్నచూపు చూస్తూ ఉంటారు. వారిని ఎప్పుడు చూసినా అవమానిస్తూ ఉంటారు. ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి అవమానాలు చాలా మంది రైతులు ఎదుర్కొన్న సంఘటనలని చూసాము. తాజాగా ఇలాంటి ఘటన ఒక రైతు కి చోటు చేసుకుంది. ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదని ఆర్టిసి బస్సు డ్రైవరు బస్సు ఎక్కించుకోలేదు.

Video Advertisement

ఇక రైతు ఆ డ్రైవర్ కంగుతినేలా చేశాడు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలంమారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల్ల అడవి సమీపంలో ఉన్న మారుమూల గ్రామం. అక్కడికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది. ఆ గ్రామానికి చెందిన రైతు గోపయ్య బొప్పాయిలని పండించి వాటిని కొల్లాపూర్ పట్టణానికి తీసుకువెళ్లి అమ్ముకుంటూ ఉంటాడు.

ఎప్పటిలాగే బొప్పాయి పండ్లని బస్సులో తీసుకు వెళ్లడానికి రోడ్డుపై ఉంచాడు. అయితే డ్రైవర్ కి ఉచితంగా పండ్లు ఇవ్వలేదన్న కోపంతో బస్సు ఎక్కించుకో లేదు డ్రైవర్. ఆవేదన కి లోనై రైతు బొప్పాయి పండ్లని రోడ్డు మీద పెట్టి అక్కడే కూర్చుని గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు. బొప్పాయి పండ్లను సాగు చేసి ప్రతి రోజూ అచ్చంపేట డిపో నుండి కొల్లాపూర్ కి వెళ్లే ఆర్టీసీ బస్సులో తనతో పాటు పండ్లకు టికెట్ తీసుకుని పట్టణానికి వెళుతూ ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా ఉచితంగా బస్సు డ్రైవర్ కి పండ్లు ఇస్తానని చెప్పాడు.

ఒకరోజు మాత్రం మర్చిపోయి పండ్లు ఇవ్వలేదు. ఆ కోపంతో డ్రైవర్ బస్సు ఎక్కించుకో లేదు. ఇంకేముంది ఆవేదనతో రైతు గోపయ్య రోడ్డుకి అడ్డంగా పండ్ల బుట్ట పెట్టి తిరిగి వెళ్తున్న బస్సుని గంట పాటు వెళ్లకుండా నిరసన చేసాడు. ఇలాంటి డ్రైవర్లు ఉంటే ఆర్టీసీకి చెడ్డపేరు అని కూడా గోపయ్య అన్నాడు. ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గోపయ్య కోరాడు.


End of Article

You may also like