ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే.. కరెంటు బిల్ రూ.100 కూడా రాదు.. అవేంటో చూడండి..!

ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే.. కరెంటు బిల్ రూ.100 కూడా రాదు.. అవేంటో చూడండి..!

by Megha Varna

Ads

రోజు రోజుకీ టెక్నాలజీ పెరుగుతోందని సరదాయే కానీ కరెంటు బిల్లు మాత్రం తడిసి మోపుడవుతోంది. నిజానికి ఒక్కొక్కసారి బిల్లును చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో కూడా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్, లాప్టాప్స్ వంటివి చాలా కామన్ అయిపోయాయి. నిజానికి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు లేకపోతే రోజు గడవడం లేదు. ప్రతి దానికి కూడా మనం వీటిపై ఆధారపడి పోయాం. అయితే వీటన్నింటి కారణంగా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది.

Video Advertisement

మీ ఇంట్లో కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందా..? తగ్గించుకోవాలి అని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం. ఇలా కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా మీ కరెంట్ బిల్ ని వేలల్లో నుండి 100 ల్లోకి తగ్గించుకోవచ్చు. కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి చార్జర్ ని ప్లగ్ నుంచి అవసరం లేనప్పుడు తీసేయాలి. స్విచ్ ఆఫ్ చేసినా సరే చార్జర్ ని స్విచ్ బోర్డు నుంచి తొలగిస్తే మంచిది. అలాగే చదువుకునే పిల్లలు రాత్రంతా పెద్ద పెద్ద లైట్లను వాడకుండా ల్యాంప్ లాంటివి వాడితే వెలుతురు ఎక్కువ వస్తుంది పైగా కరెంటు కూడా ఆదా అవుతుంది.

అలానే సీఎస్ బల్బుల వల్ల 90 శాతం అదనంగా కరెంటు బిల్లు వస్తుంది. కాబట్టి దాన్ని ఉపయోగించకండి. వాటికి బదులుగా ఎల్ఈడి బల్బులను ఉపయోగించండి. ఇవి కరెంట్ బిల్లును తగ్గిస్తాయి.ఈ మధ్య ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గ్యాప్ తీసుకున్నప్పుడు షట్ డౌన్ చేసి వెళ్ళండి. మనం కొంచెం సేపే కదా అని అలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాను.

కానీ దీనివల్ల కూడా అనవసరంగా కరెంటు వృధా అవుతుంది. కనుక మీరు బయటికి వెళ్లిన లేదు అంటే పని నుంచి కాస్త విశ్రాంతి తీసుకుంటున్న షట్ డౌన్ చేయండి. అలాగే వేడి నీళ్ళు పెట్టె హీటర్లుని టైంకి ఆఫ్ చేస్తూ ఉండండి. అలానే అవసరం లేనప్పుడు లైట్స్, ఫ్యాన్స్ ని ఆఫ్ చేయాలి. చాలామంది టీవీ పెట్టేసి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అలవాటు కూడా మానుకోవడం మంచిది.

దీనివల్ల కూడా మీరు కరెంట్ ని సేవ్ చేసుకోవచ్చు. అలానే కరెంట్ బిల్లు చార్జి అనేది యూనిట్లు బట్టి ఉంటుంది. అందుకనే మీరు మొదట కొన్ని రోజులపాటు చూసి ఆ యూనిట్ ని ఒక దగ్గర రాసుకుని అప్పటి నుండి సేవ్ చేయడం మొదలు పెట్టండి. ఇలా చేస్తే యూనిట్లు స్లాబ్లు మారిపోకుండా ఉంటాయి. అలానే ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు పవర్ సేవింగ్ ఎక్కువగా చేసే వస్తువుల్ని కొనుక్కోవడం మంచిది.


End of Article

You may also like