SRH ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయా..? వెళ్లాలంటే ఈ అద్భుతాలు జరిగితే చాలు.. అవేంటంటే?

SRH ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయా..? వెళ్లాలంటే ఈ అద్భుతాలు జరిగితే చాలు.. అవేంటంటే?

by Anudeep

Ads

గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2022 ఆఖరి దశకు చేరుకుంది. ఈ వారంలో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లీగ్ ముగియనుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుందో అనేది చిక్కు ప్రశ్నగా మారింది. ముంబై, చెన్నై తప్ప మిగిలిన జట్లు ఇంకా రేసులోనే ఉండగా గుజరాత్ టైటాన్స్ మాత్రం అధికారికంగా ప్లే ఆప్స్ కు చేరుకుంది. ఈ వారంలో ఏ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

Video Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే  ఈ జట్టు ప్లే  ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 12 మ్యాచుల్లో ఏడు పరాజయాలతో పది పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మంగళవారం మే 17న  ముంబై ఇండియన్స్ జట్టుతో సన్రై జర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇక చివరి మ్యాచ్ ని ఆదివారం పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.  సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్లలో విజయం సాధించవలసి ఉంటుంది. లీగ్ లో ఆరు మ్యాచ్ లు మిగిలి ఉండగా అందులో 2 సన్ రైజర్స్ ఆడవలసి ఉంటుంది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఫలితాలు ఈ విధంగా రావాలి.

  1. మే 17న జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ తలబడి గెలవాలి.
  2.  మే 18న జరిగే మ్యాచ్ లో కేకేఆర్ తో లక్నో సూపర్ జెయిట్స్ గెలవాలి.
  3.  మే 19న ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలవాలి.
  4.  మే 20న జరిగే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచినా పర్వాలేదు.
  5.  మే 21 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ లో ముంబై గెలవాలి.
  6.  22న పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ టీమ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి.

ఈ విధంగా ఫలితాలు ఏర్పడితేనే లక్నో తో పాటు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటారు. 12 పాయింట్లతో ఉన్నా కేకేఆర్ మరియు పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తొలగిపోతాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో రేసులో నిలుస్తాయి. ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం రన్ రేట్ అధికంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ తేడాతో ఓడగా, సన్ రైజర్స్ చివరి రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో విజయం సాధించవలసి ఉంటుంది. ఈ రెండు అద్భుతాలు జరిగితేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.


End of Article

You may also like