తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న పాపులారిటీ ఎలాంటిదో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 6 రెగ్యులర్ సీజన్లు, ఒక ఓటీటీ వెర్షన్ లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ కి పలువురు స్టార్ నటులు హోస్ట్ లుగా వ్యవహరించారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, నోడో సీజన్ నుంచి ఇప్పటివరకు కింగ్ నాగార్జున హోస్ట్ లుగా చేసారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను ఆకట్టుకోలేదని కింగ్ నాగార్జున అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీంతో నాగార్జున బిగ్ బాస్ కి వీడ్కోలు తెలుపనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సీజన్ ఫినాలే లో తదుపరి సీజన్ గురించి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.
దీంతో నాగ్ నిజంగానే బిగ్ బాస్ ని వదిలేస్తున్నారా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యం లో బిగ్ బాస్ తదుపరి హోస్ట్ ఎవరు అన్న దానిపై సోషల్ మీడియా లో చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎవరైతే తదుపరి బిగ్ బాస్ హోస్ట్ గా బావుంటారో ఒకసారి చూద్దాం..
#1 నందమూరి బాల కృష్ణ
ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో ద్వారా సరి కొత్త బాలయ్య ని మనం చూసాం. అందుకే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి బాలయ్య హోస్ట్ గా ఉంటే బావుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

#2 రానా దగ్గుబాటి
అయితే ఈ లిస్ట్ లో రానా పేరు కూడా ప్రముఖం గా వినిపిస్తోంది. రానా ఇప్పటికే నెంబర్ వన్ యారి అనే షో ద్వారా పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసాడు.

#3 రవి తేజ
స్వతహాగా మంచి హ్యూమర్ ఉన్న రవి తేజ కూడా బిగ్ బాస్ హోస్ట్ గా ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యగలరు.

#4 వెంకటేష్
విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నా షో మొత్తం ఫుల్ ఎంటర్టైన్ అవుతుంది. అలాగే ఉన్నదీ ఉన్నట్టు చెప్పడం లోను వెంకీ దిట్టే.

#5 చిరంజీవి
గతం లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా బుల్లి తెరలో అడుగు పెట్టిన చిరు.. బిగ్ బాస్ ఫినాలే లో కూడా మెరిశాడు. ఇక మెగాస్టార్ హోస్ట్ అయితే హౌస్ లో ఇక పూనకాలే.

#6 జూనియర్ ఎన్టీఆర్
అసలు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అసలు. మళ్ళీ తారక్ ని హోస్ట్ గా చూడాలని చాల మంది ఆశపడుతున్నారు.

#7 అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ గా హోస్ట్ గా వస్తే ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లే..

#8 నాని
నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన సీజన్ 2 చూస్తే తెలుస్తుంది.. నాని కామెడీ టైమింగ్, ఆయన ఎంత ఎంటర్టైన్ చేయగలరు అని.

#9 రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని హోస్ట్ గా ఒక్కసారి ఊహించుకోండి. గూస్ బంప్స్ అలా వచ్చేస్తాయి..

#10 విజయ్ దేవరకొండ
రౌడీ హీరో ని ఒకసారి బిగ్ బాస్ హోస్ట్ గా ఊహించుకోండి.. ఆ సీజన్ అదిరిపోతుందసలు..

source: https://wirally.com/actors-for-bigg-boss-7-telugu/








ఫైమా ఎలిమినేట్ అవడంతో ఆమె ఎంత పారితోషికం తీసుకుంది అనే విషయం పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఫైమా స్టార్టింగ్ లో బలమైన కంటెస్టెంట్లానే అనిపించింది. హౌస్లో కంటెస్టెంట్స్కి సంబంధించిన విషయాలు అన్ని తెలిసిపోతాయి. కానీ వాళ్ల పారితోషికం గురించి చర్చించుకోరు. కానీ బయటకు వచ్చినా కూడా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి చెప్పరు. ఎందుకంటే బిగ్ బాస్ షో అగ్రిమెంట్లో వారి పారితోషికం వివరాల గురించి తెలపకూడదని నిబంధన ఉంటుంది. తాజాగా ఫైమా పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఆమె 13 వారాలు హౌస్లో ఉండటంతో భారీగానే పారితోషికం అందుకుందని రూమర్స్ వస్తున్నాయి.
13 వారాలకు గానూ, 22 లక్షలు అందుకుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఆమె వారానికి 1, 75, 000 పారితోషికం తీసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో వారానికి 1,70, 000 ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఏ కంటెస్టెంట్కి కూడా ఇవ్వలేదని, దాన్ని బట్టి చూస్తే ఫైమాకి ఒక వారానికి 25,000-30,000 ఇచ్చి ఉండవచ్చు అని ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన వారు చెప్తున్నారు. వారి చెప్తున్న లెక్కన చూస్తే ఫైమాకి 13 వారాలకు కలిపి 3,90,000 మాత్రమే అవుతుందని మరో టాక్.













