పెళ్లి అనేది జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. ప్రతి ఆడపిల్ల తన జీవితంలోకి రాబోతున్న భాగస్వామి గురించి అనేక కలలు కంటూ ఉంటుంది. తనను చేపట్టే వాడు ఈ విధంగా ఉండాలి అంటూ కొంత అవగాహనకు వస్తుంది.
పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామి తో ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటుంది. ఈ మధ్య ప్రేమ వివాహాలతో చాలా వరకు యువత తప్పు అడుగులు వేస్తున్నారు.
ప్రేమ వివాహాలే కాదు పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా పెళ్లి చేసుకునే అబ్బాయి గురించి సరైన విషయం తెలుసుకోకుండా వివాహం చేయడం వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. వివాహం చేసుకునే ముందు అమ్మాయి కచ్చితంగా తన కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసుకొని ఉండాలి. మన చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా అమ్మాయి దాంపత్య జీవితం సుఖవంతంగా సాగిపోతుంది.
#1. కోపం :
జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు అతని బాహ్య సౌందర్యం కన్నా, వ్యక్తిగత ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని శ్రద్ధగా పరిశీలించాలని చాణిక్యనీతి చెబుతుంది. స్త్రీ ఓర్పు, సహనం కలిగినవారైతే, భర్త “కోపాన్ని” సహనంతో భరిస్తూ కుటుంబాన్ని శాంతంగా నెట్టుకొస్తుంది. అందుకే ముందుగా కాబోయే జీవిత భాగస్వామి కోపాన్ని పరీక్షించుకోవాలని చాణిక్యనీతి చెబుతుంది. ఎందుకంటే కోపం ఎంతటి దుర్మార్గునైనా తలపెడుతుంది.
#2. నడవడిక :
చాణుక్యుని నీతి ప్రకారం ఒక వ్యక్తిని వివాహం చేసుకునే టప్పుడు చూడవలసింది అతని బాహ్య సౌందర్యం కాదు. అతని నడవడిక, లక్షణాలు, సంస్కారం ఎలా ఉంది అని పరీక్షించడం చాలా ముఖ్యం.
#3. సత్ప్రవర్తన :
అందమైన మగువ కోపం పురుషుడు ఎప్పుడు పరిగెత్తకూడదని చాణిక్యనీతి చెబుతుంది. స్త్రీ తాను వివాహం చేసుకునే పురుషుడులో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తన లేని పురుషుడిని వివాహం చేసుకోవడం వలన ఆమె జీవితం దుఃఖమయంగా మారుతుంది.
#4. మతం :
చాలా మంది వివాహాలు చేసేటప్పుడు కులాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ప్రేమవివాహాలు కూడా కుల మత సంబంధం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తిని వివాహం చేసుకునే టప్పుడు ముందు ముఖ్యంగా పరిశీలించవలసింది అతను ఏ మతస్థుడు అనే విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు వేరు వేరు మతాలవారు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ల మతపరమైన ఆచారాలు వలన జీవిత భాగస్వాముల మధ్య వివాదం సంభవించవచ్చు. అందువల్లనే ఆ వ్యక్తి ఏం మతపరమైన వాడు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చాణిక్యనీతి చెబుతుంది.