హిందీ సినిమాలకు తెలుగులో ఆదరణ ఏ మేరకు ఉంటుందో మనందరికీ తెలిసిందే. షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి హీరోల సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ తెలుగులో హిందీ సినిమాకు వారం రోజుల ముందు నుంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు యానిమల్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ప్రస్తుతం లెక్కలను బట్టి చూస్తుంటే యానిమల్స్ సినిమా లెక్కలు తిరగరాసేలా కనిపిస్తోంది. తెలుగులో ఈ సినిమాకు వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా చాలా మేజర్ సెంటర్స్‌లో బుకింగ్స్ అన్నీ ఫుల్స్ అయిపోయాయి. బాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. డిసెంబర్ ఒకటిన విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తండ్రీ కొడుకుల రిలేషన్‌ను ఇప్పటి వరకు మరే దర్శకుడు ఇండియన్ స్క్రీన్ మీద చూపించని విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు సందీప్. ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరుతుంది అని అంచనాలు వినిపిస్తున్నాయి.

అందుకు ప్రస్తుతం తెలుగులో అవుతున్న బుకింగ్స్ నిదర్శనంగా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో యానిమల్కు తెలుగులో బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమా బుకింగ్స్ చాలా హైలో ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకు థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ హవా ఇంకా పెరగడం ఖాయం. తెలుగు బెల్ట్‌లోనే యానిమల్ కచ్చితంగా 50 కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ టాక్ వర్కవుట్ అయి బొమ్మ బ్లాక్‌బస్టర్ అయితే అదేం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే సందీప్ వంగా క్రేజ్ అలా ఉంది మరి. ఇక హిందీలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు లెక్కేయడం కష్టమే.




ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక తెలుగు మూవీలా అనిపించింది. ఆ మూవీలో హీరో వెంకటేష్ హీరోగా నటించారు. అదే ధర్మచక్రం. ఈ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1996 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో గిరీష్ కర్నాడ్ వెంకటేష్ తండ్రి పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా తండ్రీ, కుమారుల రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
ధర్మచక్రంలో వెంకటేష్ అగ్రెసివ్, యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. ఇక యానిమల్ మూవీలో కూడా రణ్‌బీర్ కపూర్ కూడా అలాగే కనిపించడంతో సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా నుండే యావిమల్ స్టోరీ లైన్‌ను తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కాపీ, లేదా ఇన్స్పిరేషన్ అనేది తెలియదు కానీ సందీప్ రెడ్డి దొరికిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.








మాస్ ఫాలోయింగ్ తో వర్షం చిత్రం అప్పట్లో ప్రభాస్ కి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించింది. ముందు ఈ చిత్రానికి గానూ మహేష్ బాబు హీరోగా అనుకోగా ఆయన డేట్స్ ఖాళీ లేక ప్రభాస్ ను వరించింది వర్షం చిత్రం.
24 చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయంతో వినూత్న ప్రయత్నంతో అప్పటిలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కొత్త కథతో రిస్క్ ఎందుకని మహేష్ బాబు అప్పటిలో ఈ సినిమాకి నో చెప్పేశారట.
త్రివిక్రమ్ మరియు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. మొదట్లో ఈ సినిమా కోసం మహేష్ బాబు ను సంప్రదించగా కారణం తెలియదు గానీ ఆయన ఎందుకో నో చెప్పారట.
దగ్గుబాటి రానా తొలి చిత్రంగా పరిచయమైనా లీడర్ లో హీరోగా మొదట మహేష్ బాబుని అనుకున్నారంట శేఖర్ కమ్ముల. అప్పటికే మహేష్ బాబు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం రాణాను వరించింది.





