అక్కినేని నాగచైతన్య ఈ యువ హీరో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు.హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషపెడతారు.
అయితే ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా ఆయన కూడా ఓటిటి కంటెంట్ బాట పట్టారు.ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ధూత ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. మనం సినిమా సూపర్ హిట్ కాగా, థాంక్యూ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడోసారి వీరిద్దరూ కాంబోలో వచ్చిన చిత్రమే ధూత.ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్ లుగా రూపొందించారు. ఇందులో సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటించారు. ఆయన రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు. తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.

ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ డిసెంబర్ ఒకటో తారీకు నుండి ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు ధూత, నాగచైతన్య హాష్ టాగ్స్ నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తరికెక్కించినట్లు దర్శకుడు తెలియజేశారు.ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంటే భవిష్యత్తులో నాగచైతన్య మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం ఉంది. ఎప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తానని ఆయన తెలియజేశారు.
Also Read: “OG అప్డేట్ ఇవ్వురా..?” అని అడిగిన నెటిజన్ కి… DVV టీమ్ ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!













ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.




సిమ్రాన్ పాకిస్తాన్ ప్రధానిగా మంచి నటన కనబరిచారు. షారుక్ అతిథి పాత్ర సినిమాకి హైలైట్. ఆదిత్య చోప్రా కథ, శ్రీధర్ రాఘవన్ కథనాలు ప్రేక్షకులు అలరించలేక పోయాయి. దర్శకుడు మనిష్ శర్మ కొన్ని సన్నివేశాలపై ప్రభావం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి.





