కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లియో దసరా సందర్బంగా 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. యావరేజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల సాధించడం పరిపాటిగా వస్తుంది.
విజయ్ దళపతి, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలలో లియో ఒకటి. రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది విజయ్ మూవీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లియో. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ సర్జా, సంజయ్ దత్, కీలకపాత్రలలో నటించారు. కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఈ మూవీ మొదటి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఈ చిత్రం పలు సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది.
# స్మోకింగ్ సమస్య: మొదటి పాట నా రెడీ రిలీజ్ అయ్యింది. ఈ పాట రిలీజ్ అయిన 5 రోజుల్లోనే యూట్యూబ్‌లో 33 మిలియన్ల వ్యూస్‌ను మరియు 1.9 మిలియన్ లైక్స్‌ను సాధించింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో విజయ్ దళపతి స్మోక్ చేస్తారు. విజయ్ స్మోక్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయం పై పలువురు కేసు వేశారు.
#లిరిక్స్ సమస్య: లియో మూవీలోని ఫస్ట్ సింగిల్ నా రెడీ లిరిక్స్ కూడా వివాదాస్పదం అయ్యింది. ‘ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం మరియు రౌడీయిజాన్ని పొగుడుతూ’ తీశారని, విజయ్ పై చర్య తీసుకోవాలని తమిళనాడులో ఫిర్యాదు దాఖలైంది.
#ట్రైలర్ సమస్య: ఇటీవల రిలీజ్ అయిన లియో ట్రైలర్ లో అసభ్యకరమైన పదాలను ఉపయోగించడం వివాదాస్పదం అయ్యింది.
#ఆడియో లాంచ్ ఈవెంట్: లియో మూవీ ఆడియో మరియు ప్రీరిలీజ్ ఈవెంట్లు కలిపి ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ ఈవెంట్ రద్దు అయ్యింది.
#స్పెషల్ షోలు క్యాన్సిల్: లియో మూవీ ప్రత్యేక షోలు కూడా క్యాన్సిల్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.
#ప్రీమియర్ షోలు క్యాన్సిల్: లియో మూవీ ప్రీమియర్ షోలు రద్దు చేయబడ్డాయి. ఈ షోలకోసం టికెట్ కొనుగోలు చేసినవారికి వారి డబ్బును రీఫండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: “బాలకృష్ణ” తో జత కట్టిన ఈ 13 మంది హీరోయిన్స్ కి… బాలకృష్ణకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


























ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్‌లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :



టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
టోవినో థామస్-ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మాయానది 2017లో మలయాళంలో రిలీజ్ అయిన డిఫరెంట్ ప్రేమ కథ. మొదటి షోతో యావరేజ్ టాక్ తెచ్చుకొంది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టోవినో థామస్ ఉత్తమ నటుడు, ఉత్తమ క్రిటిక్స్ అవార్డ్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మాధవ్ (టోవినో థామస్) తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. మాధవ్ డబ్బు కోసం తప్పుడు దారిలో నడుస్తుంటాడు. అయితే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కలిసిన అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన వారు విడిపోతారు. మాధవ్ కొన్ని రోజుల తరువాత ఒక మాఫియా డీలింగ్ సమయంలో అనుకోకుండా పోలీస్ అధికారిని చంపి, అక్కడి నుండి పారిపోతాడు.
ఇక ఆ రోజు నుండి పోలీసులు మాధవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో మాధవ్ తన వద్ద ఉన్న డాలర్స్ ను ఇండియన్ కరెన్సీ లోకి మార్చి, దుబాయ్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. అయితే తనతో పాటుగా తాను ప్రేమించిన అపర్ణను దుబాయ్ తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే అపర్ణ అప్పటికే అతన్ని మర్చిపోయి, హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయత్నిస్తుంటుంది. తనను వెతుకుతున్న పోలీసుల నుండి తప్పించుకుని, మాధవ్ ఎలా అపర్ణను దుబాయ్ తీసుకువెళ్లాడు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.