టాలీవుడ్ లో అద్భుతమైన నటులు ఎందరో ఉన్నారు. వారిలో తెలుగువాళ్లే కాకుండా ఇతర భాషల నుంచి వచ్చినవారు ఉన్నారు. తెలుగువారు కానప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడివాళ్ల కన్నా ఎంతో గుర్తింపును, క్రేజ్ ను సొంతం చేసుకున్న నటులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి నటులలో నాజర్ అగ్రస్థానంలోఉంటారని చెప్పవచ్చు.
ఆయనది తమిళనాడు అయినా సుమారు 6 భాషల్లో వందల చిత్రాలలో నటించారు. ఆడియెన్స్ అలరిస్తూ నటుడిగా విజయం సాధించిన నాజర్, వ్యక్తిగత జీవితంలో విషాదం చోటుచేసుకుంది. హీరో అవుతాడుకున్న కొడుకు, మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి ఎవరు గుర్తులేరు. ఒక్క హీరో మాత్రమే గుర్తున్నాడు. మరి నాజర్ కుమారుడికి ఏమైందో ఇప్పుడు చూద్దాం..
నాజర్ అసలు పేరు మహమ్మద్ హనీఫ్. విలక్షణ నటుడు నాజర్ గురించి, ఆయన నటన గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది. నాజర్ తమిళనాడులో మేలేరిపాక్కంలో మెహబూబ్ బాషా,ముంతాజ్‌లకు 1958లో మార్చి 5న జన్మించాడు. ఇండస్ట్రీకి రాకముందు నాజర్ భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఆ తరువాత నటనలో శిక్షణ పొందాడు. 1985లో నాజర్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించారు.
కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో అలరించిన నాజర్ కి ముగ్గురు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు అబ్దుల్ ఫైజల్ హస్సన్, రెండో కుమారుడు లూత్ఫుద్దీన్ మరియు మూడవ కుమారుడు అబి హస్సన్. లూత్ఫుద్దీన్ కోలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు. అయితే పెద్ద అబ్బాయి ఫైజల్ 2014 లో మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఫైజల్ కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అయితే అభిమాన హీరో అయిన విజయ్ దళపతి మాత్రమే అతనికి గుర్తున్నాడు.
టీవిలో విజయ్ దళపతి సినిమాలు గాని, పాటలు గాని వచ్చినపుడు ఫైజల్ సంతోషంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడట. ఎక్సయిట్మెంట్ తో విజయ్ సినిమాలు చూస్తుంటాడట. ఇటీవల జరిగిన ఫైజల్ బర్త్ డేకు విజయ్ హాజరై ఫైజల్ ను సర్ప్రైజ్ చేసాడు. నాజర్ ఫైజల్ యాక్సిడెంట్ గురి కావడానికి కొద్ది రోజుల ముందు అతను హీరోగా ఒక సినిమాకి సన్నాహాలు చేసుకున్నారు. కానీ యాక్సిడెంట్ జరగడంతో గత తొమ్మిదేళ్లుగా బెడ్ పై, వీల్ చైర్ సాయంతో కొడుకు జీవిచడం నాజర్ ని వేదనకు గురిచేస్తోంది.









‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటించగా, కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, సీనియర్ హీరోయిన్ గౌతమి, నరేష్, అలనాటి నటి తాళ్ళూరి రామేశ్వరి, తిరువీర్,బాబూ మోహన్, ప్రేమ్ సాగర్ కీలకపాత్రలలో నటించారు. గోమఠేష్ ఉపాధ్యాయ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ కు యాక్టర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ఇక కథ విషయానికి వస్తే, కుమారి శ్రీమతికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమె తల్లి పెళ్లి చేసుకోమని చెప్తూ, ఉంటుంది. అయితే తాత ఇచ్చిన ఆస్తిని ఆమె బాబాయ్ లాగేసుకుని, శ్రీమతి ఫ్యామిలిని బయటకు తోసేస్తాడు. శ్రీమతి కోర్టు వెళ్తుంది. ఆ ఇంటిని తిరిగి పొందేవరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీమతి తల్లికి చెబుతుంది. కోర్టు ఆరు నెలల లోపు 38 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కోవచ్చని తీర్పు చెబుతుంది.
అయితే శ్రీమతి జీతం నెలకు రూ.13 వేలు. ఆరునెలల్లో రూ.38 లక్షలు సంపాదించడం కోసం బాగా ఆలోచించిన శ్రీమతి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బార్ పెట్టి, ఊర్లో వాళ్ళను అందర్నీ బాగా తాగించి, 38 లక్షల రూపాయలు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. శ్రీమతి ఆ డబ్బును సంపాదించిందా? ఇంటిని దక్కించుకుందా? ఆఖరికి పెళ్లి చేసుకుందా? లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలానే నిత్యా మీనన్ కుమారి శ్రీమతిగా అద్భుతంగా నటించింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన మూవీ స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, సాయి మంజ్రేకర్, గౌతమి, ఇంద్రజ, మురళి శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలలో నటించారు. మూవీ రిలీజ్ కు ముందు వచ్చిన రెండు ట్రైలర్లలో హీరో రామ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. రెండో ట్రైలర్ అయితే గూస్బంప్స్ తెచ్చింది.
యాక్షన్ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్‌తో రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కంద మూవీలోని రెండు సన్నివేశాల పై నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఒక సన్నివేశం ఏమిటంటే, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్. రామ్, శ్రీలీల పెయిర్ బాలేదని, అలాగే వారి మధ్య వచ్చే సీన్స్ అసలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ చెప్పే డైలాగ్స్, స్కూల్ అమ్మాయి లేదా టీనేజర్ కి ఇచ్చినట్టు ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరో సన్నివేశంలో హీరో చాలా హ-త్యలు చేస్తాడు అని చెప్తారు. అన్ని హ-త్యలు చేస్తే పోలీసులు హీరోని పట్టుకోరా అని ట్రోల్ చేస్తున్నారు.
పెదకాపు ట్రైలర్ చూసినవారంత షాక్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి మాస్ మూవీని ఎలా తీస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. దాంతో రిలీజ్ కు 2 రోజుల ముందే బుధవారం నాడు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షోకు వెళ్ళిన సినీ సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పీఆర్వోలు, మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చూశారట.
వీళ్లంతా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పెదకాపు సినిమా పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. మూవీ చూసిన వారంతా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారని, మూవీని రస్టిక్‌గా తీశారని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలోని క్యారెక్టర్స్, డైలాగులు, విజువల్స్, కొన్ని సీన్స్ ఇప్పటికీ మైండ్ లో తిరుగుతున్నాయని ఒకరు ఎక్స్‌లో రాసుకొచ్చారు.
మరొకరు మాకూ ఒక వెట్రిమారన్ ఉన్నాడని అనిపిస్తోందని అన్నారు. ఇంకొకరు తెలుగులో గొప్ప కెమెరామేన్ ఉన్నారని ఛోటా కె నాయుడు తన వర్క్‌తో గుర్తు చేశారని సినీ జర్నలిస్ట్ రాసుకొచ్చారు. కొన్ని షాట్స్, ఫ్రేమ్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని ప్రశంసించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారట. టెక్నీషియన్స్ అంతా బెస్ట్ వర్క్ ఇచ్చారని రాసుకొచ్చారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ యానిమల్. కొన్ని రోజులుగా ఈ మూవీలోను కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు (సెప్టెంబర్ 28) సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రణ్‌బీర్ కపూర్ ను ‘యానిమల్’ లా వయలెంట్‌గా చూపించారు.
టీజర్‌ను చూస్తే, తండ్రీ కుమారుల మధ్య ఎమోషన్ కనిపిస్తోంది. అయితే ఒక టిపికల్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం అంత స్పష్టంగా తెలియలేదు. రణ్ బీర్ కపూర్ కొన్ని చోట్ల చాలా కూల్‌గా, కొన్ని చోట్ల చాలా వయలెంట్‌గా కనిపించాడు. రణ్ బీర్ కపూర్ చెప్పిన డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచేస్తున్నాయి.
యానిమల్ టీజర్ విజువల్స్, సంగీతం, బిజీఎం ఇలా ప్రతిదీ అందరినీ ఆశ్చర్య పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ స్టాండర్డ్‌లో ‘యానిమల్’ మూవీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ టీజర్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
watch video :
















