హీరోలకి, అభిమానులకి అవినాభావ సంబంధం ఉంటుంది. వారికి వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు తెలియకపోయినా కూడా సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా వారికి ఒక రిలేషన్ ఏర్పడుతుంది. “మా హీరో” అని ఆ అభిమానులు అనుకుంటూ ఉంటే, “నా అభిమానులు” అని ఆ హీరోలు అనుకుంటూ ఉంటారు.
అయితే సౌత్ ఇండియాలో హీరోలని అభిమానించడం కంటే పూజించడం ఎక్కువగా ఉంటుంది అని చాలా మంది అన్నారు. అది నిజం. వారి సినిమాలు వస్తున్నాయి అంటే కటౌట్లకి పాలాభిషేకాలు చేయడం, దండలు వేయడం, పూజలు లాంటివి చేయడం కూడా చేస్తారు.

అందుకే చాలా మంది హీరోలు కూడా ఏదైనా ఈవెంట్ లో మాట్లాడేటప్పుడు వారి అభిమానుల గురించి మాట్లాడుతూ, “ఏం ఇచ్చినా సరే మీరు రుణం తీర్చుకోలేను” అని అంటారు. అయితే ఈ అభిమానం ఒక్కొక్కసారి చాలా ఎక్కువైపోయి కొన్ని అనుకోని సంఘటనలకు దారి తీస్తుంది. రవితేజ హీరోగా నటించిన నేనింతే అనే సినిమాలో హీరో పాత్ర పోషించిన సుబ్బరాజుని అభిమానించే ఒక వ్యక్తి అప్పులు చేసి ఆ హీరో కోసం ఆ సినిమా కోసం పబ్లిసిటీ చేయడం, ఆ తర్వాత సినిమా పోవడంతో ఆత్మహత్య చేసుకోవడం చూసి, “ఇలాంటివి నిజంగా జరుగుతాయా?” అని అనుకుంటాం.

From : Babu Goud (Twitter)
కానీ సినిమాలు కూడా నిజ జీవితంలో నుండి పుట్టినవే అనే విషయం మర్చిపోతాం. ఇప్పుడు దాదాపు ఇలాంటి సంఘటన జరిగింది. ఒక రామ్ చరణ్ అభిమాని లెటర్ రాసి మరి ఈ పని చేశారు. ఇందులో ఆ అభిమాని ఈ విధంగా రాశారు, “నా కుటుంబానికి, స్నేహితులకి, ప్రియమైన వారికి, చాలా బరువైన గుండెతో నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయాన్ని రాస్తున్నాను. ఒక రామ్ చరణ్ అభిమానిగా ఆయన రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కోసం రెండు సంవత్సరాల నుండి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాను. కానీ నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి వార్తలు లేవు.”

“అందుకే వారు ఏం చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నాను. నేను వారికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నాను. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేయకపోతే నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. ఒకవేళ అలా జరిగితే, నా చా-వుకి, శంకర్ షణ్ముగం, దిల్ రాజు, SVC ప్రొడక్షన్ హౌస్ కారకులు అవుతారు. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. దీని వల్ల ఫలితం వస్తుంది. లవ్ యు. నేను చేసిన పనులకి సారీ. లవ్ యు చరణ్ అన్న, మిస్ యు సో మచ్.”

“వచ్చే జన్మలో అయినా నీకు ఒక గొప్ప అభిమానిగా ఉంటాను అని అనుకుంటున్నాను. లవ్ యు సో మచ్. నీ, బాబు గౌడ్.” అని ఈ లెటర్ లో రాశారు. సోషల్ మీడియాలో ఉన్న ఈ లెటర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది చూసిన చాలా మంది మాత్రం, “దీన్ని అభిమానం కాదు. మూర్ఖత్వం అంటారు” అని అంటున్నారు. ఎందుకంటే, “మనం అభిమానించే హీరోతో పాటు, సినిమా బృందం అంతా కూడా రాత్రి, పగలు, అసలు సంవత్సరాలు తేడా లేకుండా సినిమా కోసం కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవడం పోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మంచి విషయం కాదు” అని అంటున్నారు.
ALSO READ : “బ్రహ్మానందం” ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న తమిళ్ ఆడియన్స్..! కారణం ఏంటంటే..?

కోలీవుడ్ టాప్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ ‘కిక్’. ఈ చిత్రంలో తాన్య హోప్ మరియు రాగిణి ద్వివేది హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌రాజ్ దర్శకత్వం వహించారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత బ్రహ్మానందం తమిళ సినిమాలో నటించాడు. ఈ మూవీ లో సైంటిస్ట్ వాలి అనే క్యారెక్టర్ నటించాడు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
2016లో సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా జూమ్ కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. డీడీ రిటర్న్స్‌తో విజయాన్ని సాధించిన సంతానం ఈ మూవీతో మరో విజయాన్ని అందుకోవాలనుకున్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరించింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరస్ట్ సినిమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, “అసలు ఇలాంటి సినిమాలో బ్రహ్మానందం ఎలా నటించారు?” “ఏం చూసి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు?” అంటూ బ్రహ్మానందంని కూడా కామెంట్ చేస్తున్నారు. తమిళ్ వాళ్ళు అయితే మన స్టార్ కమెడియన్ ని అలాంటి సినిమాలో చూసి ఏకంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా రెండున్నర గంటల పాటు సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి అని కామెంట్ చేస్తున్నారు. సినిమా అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఉందని దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అయితే జగతి క్యారెక్టర్ లో చాలా పద్ధతిగా, హుందాగా కనిపించే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో చిన్న చిన్న డ్రెస్సులతో ఓ రేంజ్ రచ్చ చేస్తోంది. జ్యోతి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసినవారు అసలు ఇన్ స్టాలో ఫోటోలకు, జగతి మేడంకు పోలికలు ఏమైనా ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు.
అయితే గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని రీసెంట్ గా బయటపెట్టింది. ది ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఆ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి, నెట్టింట్లో వైరలయ్యింది. ఇదిలా ఉంటే, కొంతకాలంగా జ్యోతిరాయ్ పర్సనల్ విషయాలపై రక రకాల వార్తలు వచ్చాయి. 20 ఏళ్ళ వయసులోనే జ్యోతిరాయ్ కి పెళ్లి అయ్యి, ఒక బాబు ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు డైవర్స్ ఇచ్చింది.
ఆమె ఒక యువ దర్శకుడితో ప్రేమలో ఉందనే వార్తలు వినిపించాయి. తాజాగా తన పై వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఆ దర్శకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ రింగ్ ఉన్న ఎమోజిని షేర్ చేశారు. ఇలా షేర్ చేయడంతో తమ రిలేషన్ అఫిషియల్ గా ప్రకటించారని తెలుస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు వీరి ఎంగేజ్మెంట్ జరిగిందా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.













‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. బాలీవుడ్లో పలు చిత్రాలకు దర్శకత్వం చేసినా, రాని గుర్తింపు ఈ మూవీతో వివేక్ అగ్నిహోత్రికి వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ది వ్యా-క్సి-న్ వార్ మూవీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమి గౌడ గిరిజా ఓక్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కి డైరెక్టర్ గా డాక్టర్ భార్గవ(నానా పాటేకర్) పని చేస్తుంటారు. ఆయన తన టీమ్ తో కలిసి న్యుమోనియా అరికట్టడానికి వ్యా-క్సి-న్ కనిపెట్టడానికి వర్క్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే కరోనా ప్రపంచం అంతటా విరుచుకుపడుతుంది. మీడియాలో వచ్చే కరోనా వార్తలతో ప్రజలందరూ భయపడుతుంటారు.
కరోనా సోకి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నేషనల్ వైరాలజి ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి) కోవిడ్ కు వ్యా-క్సి-న్ కనిపెట్టేందుకు భార్గవ టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వస్తుంది. మగవాళ్లే భయపడి ముందుకు రాని టైమ్ లో మహిళా సైంటిస్టులు ముందుకు వస్తారు. డాక్టర్ భార్గవ, డాక్టర్ అబ్రహం టీమ్స్ వ్యా-క్సి-న్ తయారీలో ఎలా విజయం సాధించారు? ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అనేది మిగిలిన కథ.



మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బోయపాటి మూవీ అంటేనే భారీ యాక్షన్, అదిరిపోయే మాస్ డైలాగులు, ఎమోషన్, గాలిలోకి ఎగిరే ఫైట్స్ ఉంటాయి.
ఇక ఈ మూవీ ఊరమాస్ గా తెరకెక్కించారు. లవర్ బాయ్ గుర్తింపు ఉన్న రామ్ స్కందలో ఊరమాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా బోయపాటి రామ్ ను అనుకోలేదట. తెలుగు స్టార్ హీరోను ఊహించుకుని స్కంద కథను రాశారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాక్ నడుస్తోంది. స్కంద స్టోరీ మొత్తం చెప్పాక మహేష్ ఈ మూవీ చేయలేనని చెప్పారట.
ఈ స్టోరీ తనకు సెట్ అవ్వదని, సున్నితంగా రిజెక్ట్ చేసారంట. ఇంత ఊర మాస్ గా ఫ్యాన్స్ తనను చూడలేరని చెప్పారట. అలా మహేష్ బాబు స్కందను సున్నితంగా తిరస్కరించారని టాక్. మరొక టాక్ ప్రకారం బోయపాటి స్కంద రాసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అని, అల్లు అర్జున్ ఈ మూవీని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
2017లో రిలీజ్ ఈ మూవీకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మూవీలో రౌడీ హీరో యాక్టింగ్ కు, యాటిట్యూడ్‌కు యువత ఫిదా అయ్యారు.
ఈ మూవీకి ఉత్తమ తెలుగు చిత్రం మరియు ఉత్తమ తెలుగు దర్శకుడు, ఉత్తమ తెలుగు నటుడు కేటగిరీలో పలు అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్య వర్మ, వర్మ 2 సార్లు రీమేక్ చేయబడింది. ఈ మూవీని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. విమర్శలు చేశారు. అయినప్పటికీ ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది.
అయితే ఈ మూవీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. మినీ_.బస్ అనే ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ షాప్ లో ఒక బ్యాట్ ను కొని, షాలిని పాండేతో బైక్ పై కాలేజీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక, బ్యాట్ పక్కన పడేసి అమిత్ ని చెయ్యితో కొడ్తాడు.