స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 2.11 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ లాగే ట్రైలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఎప్పటిలానే నిత్యామీనన్ తన నటనతో ఆకట్టుకుంది.
గౌతమి, కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నిరుపమ్ పరిటాల, తిరువీర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ టీజర్ లో నిత్యామీనన్, గౌతమి పాటు ఒక సీనియర్ హీరోయిన్ కనిపించింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్ కలిసి నిర్మించాయి. ఈ సిరీస్ కు గోమఠేష్ ఉపాధ్యాయ డైరెక్షన్ చేయగా, యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఈ సిరీస్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దీనిని తెలుగులోనే కాకుండా తమిళ్, మళయాల, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో నిత్యామీనన్, గౌతమితో పాటు ఒక సీనియర్ నటి కనిపించారు. ఆమె ఎవరో కాదు తాళ్లూరి రామేశ్వరి. తెలుగు, హిందీ, ఒడియా, మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించి, ఆకట్టుకున్నారు. రామేశ్వరి 1977లో మొదటిసారి ‘దుల్హన్ వహీ జో పియా మాన్ భాయే’ మూవీలో నటించింది. ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పెద్ద బ్రేక్ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి.
తెలుగులో 1978 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీతామాలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ నటించింది. ఈ మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యింది. రీ ఎంట్రీలో మహేష్ బాబు హీరోగా నటించి నిజం మూవీలో తల్లిగా నటించింది. ఆ తరువాత పలు సీరియల్స్ నటించింది. తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ నానమ్మగా కనిపించింది.

రీసెంట్ గా “జవాన్” డైరెక్టర్ అట్లీ తన సినిమాని ఆస్కార్ కి పంపిస్తానని చెప్పగా, నెటిజెన్లు ఆయనను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేశారు. పాత మసాలా చిత్రాలన్ని కలిపి కలగూరగంపలా, తీసిన మూవీని ఆస్కార్ కి పంపి ఏం మెసేజ్ ఇస్తారని నెటిజెన్లు గట్టిగా తలంటారు. ఆ ట్రోలింగ్ ఆపకముందే మరో రెండు సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
వివాదాస్పద మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అదా శర్మ సంతోషంతో తాను నటించిన మూవీని ఆస్కార్ కు పంపాలని అనుకుంటున్నారని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై నెటిజన్లు కౌంటర్లు కూడా వేస్తున్నారు.
మరో సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, ఈ మూవీని కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ మూవీని కూడా ఆస్కార్ కు పంపించాలని అనుకుంటునట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, అలియా ఓవర్ యాక్షన్ చేశారని, ఇలాంటి మూవీని ఆస్కార్ పంపిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆర్కియాలజిస్టుగా దివ్య (రెజీనా కసండ్రా) పురావస్తుశాఖలో పని చేస్తుంటుంది. నల్గొండ సమీపంలోని అడవిలో టూరిస్ట్ గా వచ్చిన విదేశీయుడు మాయమవుతాడు. అయితే అతను అడవిలోని ఊబిలో చిక్కుకుని మరణించాడని పోలీసులు గుర్తిస్తారు. అయితే డెడ్ బాడీ దొరకదు. దాంతో ఆర్కియాలజిస్టు దివ్య సహాయం తీసుకుంటారు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసే రాజా(వెన్నెల కిషోర్) సహాయంతో దివ్య అడవిలో పాతి పెట్టిన డెడ్ బాడీ స్కెలిటన్ ని వెలికితీసి పోలీసులకు అందజేస్తుంది.
కానీ ఫారెన్సిక్ పరిశోధనలో ఆ అస్థిపంజరం చనిపోయిన విదేశీయుడిది కాదని, చాలా ఏళ్ల క్రితం చనిపోయిన దమయంతి(రెజీనా )కి సంబంధించిందని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత దమయంతి డీసీపీని మరియు అతని తమ్ముడిని చంపుతుంది. అసలు దమయంతి ఎవరు? దివ్యకి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? డీసీపీని, అతని తమ్ముడిని దమయంతి ఆత్మ ఎందుకు చంపింది? అడవిలో అదృశ్యం అయిన విదేశీయుడు ఎవరు? అనేది మిగతా స్టోరీ.
రెజీనా కసండ్రా దివ్య, దయమంతిగా రెండు డిఫరెంట్ కోణాలు ఉన్న క్యారెక్టర్ లో నటించింది. జమీందారి ఫ్యామిలీకి చెందిన దయమంతిగా దర్బం, హోదాతో నటించింది. దివ్య పాత్రతో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదట్లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా కొనసాగింది.
ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా తెలుగు చిత్రాలలో నటిస్తూ, లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. విరాట పర్వం మూవీ తరువాత కాస్త విరామం తీసుకున్న సాయి పల్లవి తమిళంలో ఒక చిత్రాన్ని, తెలుగులో నాగచైతన్యతో ఒక సినిమాని అంగీకరించింది.
అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి రహస్యంగా ఒక డైరెక్టర్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుందని రూమర్స్, దానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో సాయి పల్లవి, కోలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి పూలదండలతో ఉన్నారు. అయితే అవన్నీ రూమర్స్. సాయి పల్లవి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (SK21) సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ ప్రారంభోత్సవంలో జరిపిన పూజలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామితో పాటు సాయి పల్లవి పాల్గొంది. ఆ సమయంలో పూజారులు వారికి దండలు వేసి, క్లాప్ కొట్టటం, స్క్రిప్ట్ అందించారు.
ఈ ఫోటోలను దర్శకుడు రాజ్ కుమార్ పరియసామి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయం పై తాజాగా సాయి పల్లవి సీరియస్ ట్వీట్ చేసింది. “ఇటువంటి రూమర్స్ అసలు పట్టించుకోనని, కానీ ఈ రూమర్స్ వల్ల కుటుంబం, ఫ్రెండ్స్ ఇబ్బంది పడితే చూస్తూ ఉండలేను. ఆ ఫోటో ఒక మూవీ పూజా కార్యక్రమంలో తీసిన ఫోటో అని, కొంతమంది కావాలనే డబ్బులు ఇచ్చి ప్రచారాలను పుట్టిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పనులు ఇప్పటికైనా ఆపండి. ఇంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు.” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.











ఇటీవల కాలంలో ఏఐ టూల్స్ ను ఉపయోగించి, దేవుళ్ళ ఫోటోలను, సినీ సెలబ్రిటీల ఫొటోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఫోటోని టాలీవుడ్ స్టార్ హీరో ముఖంలా రూపొందించారు. ఆ హీరో మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కోస్తా ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా శ్రీనివాస్ మోహన్ రెండు ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
ఆ పోస్ట్ కు ప్లేయింగ్ విత్ ఏఐ ఇల్యూజన్ టూల్ అని పెట్టాడు. సముద్ర తీరాన ఉన్న పడవలతో ఎన్టీఆర్ ఫేస్ ను డిజైన్ చేశాడు. క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మాస్, టెర్రిఫిక్ వంటి పదాలు సరిపోవేమో దేవర అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఫోటోలే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది?’ అని నెట్టింట్లో అభిమానులు చర్చించుకుంటున్నారు.
తెలుగు స్టార్ హీరోల సినిమాలకి రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ స్పెషల్ షోలుగా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో డబ్ అయిన సినిమాలకు కూడా రీరిలీజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలకు రీరిలీజ్ లో అద్భుతమైన ఆదరణ వచ్చింది. దాంతో ఈ రోజు కల్ట్ క్లాసిక్ 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ చేశారు.
2004 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీతో పాటు, అందులోని సాంగ్స్ కు అప్పటి యూత్ ఫిదా అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించింది.
కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాని ఇప్పటికి టీవీలలో ప్రసారం అయితే చూడటానికి ఇష్టపడతారు. 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ కోసం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేసింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. ఇక ఈ మూవీ రీరిలీజ్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ను మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.












