సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ జైలర్. ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ రూ. 620 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ మూవీ ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు మరియు రజినీకాంత్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. దాంతో ఈ మూవీ పలు రీకార్డులను బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ కథను ముందుగా టాలీవుడ్ టాప్ హీరోకు వినిపించారంట. కానీ ఆయన రిజెక్ట్ చేసారంట. ఆ తెలుగు హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, ప్రధాన పాత్రలలో నటించిన సినిమా జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రజినీకాంత్ కెరీర్లో ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే జైలర్‌లో రజనీకాంత్ హీరోగా కాకుండా తండ్రి పాత్రలో నటించి ఆశ్చర్యపరిచారు.
ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అతిథి పాత్రలో నటించి, మెప్పించారు. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని తెలుగు టాప్ హీరోతో తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి.
నెల్సన్ బీస్ట్ మూవీ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి జైలర్ కథను చెప్పాడట. కథ చిరంజీవి బాగా నచ్చిందట. కానీ ఇటువంటి స్టోరీలో ఫ్యాన్స్ తనను చూడగలరా? రీ ఎంట్రీ నుండి కమర్షియల్ చిత్రాలే చేస్తున్నాను. ఈ టైమ్ లో ఇటువంటి స్టోరీతో రిస్క్ అని జైలర్ మూవీ చెయ్యడానికి నిరాకరించారంట. ఆ తరువాత నెల్సన్ ఈ స్టోరీని రజినీకాంత్ ని చెప్పడం, ఆయనకీ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు. జైలర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేస్తోంది.
Also Read: ఈ అమ్మాయి గురించి మన తెలుగు వాళ్లు తెగ వెతికేస్తున్నారు..! ఇంతకీ ఈమె ఎవరంటే..?

హీరోయిన్ అమీ జాక్సన్ 2010 లో రిలీజ్ అయిన ‘మద్రాసపట్టినం’ అనే తమిళ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ మూవీ విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. తక్కువ కాలంలోనే క్రేజ్, స్టార్ డమ్ సంపాదించుకుంది. ఐ, 2.ఓ, తేరి లాంటి సినిమాలలో నటించింది. ఆ తరువాత ఎవడు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కనిపించింది కొంతకాలం అయినా వరుసగా స్టార్ హీరోలతో నటించింది.
రజినికాంత్, విజయ్ దళపతి, విక్రమ్, ధనుష్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. 2018లో రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘ది విలన్’ లో శివ రాజ్‌కుమార్, సుదీప్‌లతో కలిసి అమీ జాక్సన్ నటించింది. శంకర్ చిత్రాలలో నటించింది. కానీ అవి అంతగా కలిసిరాలేదు. రోబో 2.0 తరువాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కానీ తన వ్యక్తిగత జీవితంతో పెళ్లి అవకుండానే తల్లి కావడం, అతనితో బ్రేకప్, మళ్లీ లవ్ లో పడటం లాంటి వాటితో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
కొడుకుతో, తన లవర్ తో సంతోషంగా గడుపుతోంది. వాటికి సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చాలా కాలం తరువాత ‘మిషన్ చాప్టర్ 1: అచ్చమ్ ఎన్బతు ఇల్యాయే’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో అరుణ్ విజయ్ హీరో గా నటిస్తున్నారు. తాజాగా అమీ లండన్ ఫ్యాషన్ వీక్‌లో రెడ్ కలర్ దుస్తుల్లో హాజరైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె లుక్ కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. వాటిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాల ద్వారా తెలుగువారికి చేరువైన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించి, మెప్పించింది.
రుక్మిణీ న్యాచురల్ లుక్స్‌కి కన్నడ యువత ఫిదా అయ్యింది. ఈ మూవీ పోస్టర్స్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీతో రుక్మిణీకి కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చాయి. రుక్మిణీ వసంత్ గురించి నెటిజెన్లు నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. రుక్మిణి వసంత్ 1994లో కర్ణాటకలోని బెంగళూరులో డిసెంబరు 10న జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్రను కర్నాటకలో పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
ఆమె బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో పట్టా పొందింది. ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 2019లో బీర్బల్ ట్రైలాజీ కేసు 1′ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సప్త సాగర దాచే ఎల్లో ఆమె రెండవ సినిమా. ఇక త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది. ఆమె నటన, లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగులో కూడా పాపులారిటీ వస్తుంది. మరి సప్త సాగరాలు దాటి మూవీతో రుక్మిణీ వసంత్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
1. విజయ్ ఆంటోనీ:
2. అమీర్ ఖాన్:
3. కాజోల్:
4. గోవిందా:
5. ప్రకాష్ రాజ్:
6. ప్రభుదేవా:
7. శిల్పాశెట్టి:
కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నో థియేటర్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ది చెందిన థియేటర్లలో బెంగళూరులోని మరతహళ్లి రోడ్ లో ఉన్న తులసి థియేటర్ ఒకటి. ఈ థియేటర్ ప్రారంభించి దాదాపు యాబై సంవత్సరాలు అవుతోంది. ఎన్నో వేల సినిమాలు ఇక్కడ ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటిదాకా లక్షలాది ప్రేక్షకులు ఈ థియేటర్ లో సినిమాలు చూసి ఆనందించించారు. ఇందులో కేవలం కన్నడ సినిమాలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలో తమిళ మరియు తెలుగు సినిమాలు ప్రదర్శితం అయ్యాయి.
కన్నడ ప్రేక్షకులు తమ సినిమాలు ఈ థియేటర్ లో చూసి ఎంత ఆనందిస్తారో, అదే విధంగా కర్ణాటకలో నివసించే తెలుగువారు కూడా తులసి థియేటర్ లో తెలుగు సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని నెలల క్రితం రీరిలీజ్ అయిన తెలుగు సినిమాలకు వెళ్ళిన ఆడియెన్స్ సెలెబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
అయితే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న తులసి థియేటర్ ను శాశ్వతంగా మూసి వేశారు. దానికి కారణం అక్కడి భూమి విలువ 5 రెట్లు పెరగడమే అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కర్నాటక ప్రజలు, అక్కడ ఉండే తెలుగు, తమిళ వాళ్ళు కూడా ఈ థియేటర్ తో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఈ థియేటర్ ని బాగా మిస్ అవుతామని కామెంట్స్ చేస్తున్నారు.
సన అసలు పేరు షానూర్ సన బేగమ్. ఆమె తండ్రి క్రిష్టియన్, తల్లి ముస్లిం, తల్లిదండ్రుల మతాలు వేరైనప్పటికీ, తెలంగాణలో పుట్టిన సన, ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెరిగింది. ఆమెకు మొదటి నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి ఉన్నా, కుటుంబ సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని, వాటి వైపు వెళ్ళలేదు. ఆమెకు టెన్త్ క్లాస్ లోనే పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత సన ఇష్టాలను గుర్తించిన అత్తమామలు ఆమెను చదవించడమే కాకుండా సనకు ఆసక్తి ఉన్న రంగంలోకి వెళ్ళేలా ప్రోత్సహించారని ఒక సందర్భంలో సన చెప్పుకొచ్చారు.
మొదట మోడలింగ్ ఫీల్డ్ లో రెంటరీ ఇచ్చిన సన, ఆ తరువాత యాంకరింగ్ చేశారు. ఆ తరువాత సినిమాలు, సీరియల్స్. ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అత్తమామలే అని సన చెప్పుకొచ్చారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో సన టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో మూవీలో సన నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ముస్లిం అయ్యి ఉండి అమ్మవారి పాత్ర వేయడానికి కారణం ఏమిటి అడిగారు.
సన మాట్లాడుతూ ” నటిగా ఏ పాత్ర వచ్చినా చేశాను. అలా అమ్మవారిగా నటించాను. ఇప్పుడు హిందూ ముస్లిం అని అంటున్నారు. కానీ, ఆ రోజుల్లో ఇలా మాట్లాడుకునేవాళ్ళు కాదు. అప్పుడు అందరూ హిందువు అనుకున్నారు కానీ ముస్లిం అని అనుకోలేదని అన్నారు. అమ్మవారి పాత్ర ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించలేదు. తనకు ఆ ఆలోచన రాలేదని అన్నారు. అమ్మవారి ఫోటో ఇచ్చారు. ఆ అమ్మవారే తనను ఎంచుకున్నప్పుడు ఆ పాత్ర చేయను అని చెప్పడానికి నేనెవర్నిని. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే ఈ పాత్ర వచ్చిందని, ఇప్పటికీ అమ్మవారిని నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చారు.
కొన్ని సినిమాలును థియేటర్లో మాత్రమే చూడాలి అనడం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అలాంటి మూవినే పుష్పక విమానం, ఈ మూవీ విడుదల అయ్యి 36 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత ఆ మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ పేజీని సృష్టించుకుంది. కమర్షియల్ హీరోలు సాధారణంగా ప్రయోగాలు చేయడానికి సాహసించరు. కానీ కమల్ హాసన్ ఎన్నో చిత్రాలలో ప్రయోగాలు చేశారు.
అలాంటి సినిమాలలో క్లాసిక్ మూవీ పుష్పక విమానం ఒకటి. ఇలాంటి మూవీ చూసే థియేటర్ లో చూసే అవకాశం నేటి తరం ప్రేక్షకులకు అందివ్వాలని ఈ సినిమాని రీరిలీజ్ చేయబోతున్నారట. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూకీ మూవీలో డైలాగ్స్ ఉండవు. సైగల ద్వారా మాత్రమే చిత్రంలోని క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూ, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా స్టోరీ అర్థమయ్యే విధంగా గొప్పగా తెరకెక్కించారు. 1987లో ఈ మూవీ కన్నడ భాషలో రూపొందింది.
ఆ తరువాత తెలుగులో పుష్పక విమానం, తమిళంలో పేసుం పదం, హిందీలో పుష్పక్ గా విడుదల చేశారు. ఈ మూవీలో కమల్ హాసన్, అమల, ప్రతాప్ పోతన్, టిను ఆనంద్, పీఎల్ నారాయణ వంటి వారు అద్భుతమైన నటనతో కట్టిపడేసేలా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎల్ వైద్యనాథన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సైలెంట్ డ్రామాకు ప్రాణం పోశారు. కమర్షియల్ అంశాలు, మాస్ మాసాలా వంటివి లేకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. 35 లక్షల బడ్జెట్ తో మూవీ తీస్తే, కోటి రూపాయలు పైగా కలెక్ట్ చేసి, అప్పట్లో రికార్డు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1964లో ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఎన్టీఆర్, ఏయన్ఆర్ నటించిన సినిమాలకు వచ్చాయి. వీరిద్దరూ హిందీ, తమిళ చిత్రాలలో నటించారు. అలాగే వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఎన్టీఆర్ నిమ్మకూరు నుండి వస్తే, ఏయన్నార్ గుడివాడలోని వెంకట రాఘవపురం నుండి వచ్చారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి తమ వారసులను అందించగా, వారిద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఇప్పటికీ రాణిస్తున్నారు.
నందమూరి, అక్కినేని కుటుంబాల నుండి మూడవ జనరేషన్ వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఏయన్ఆర్ మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ మాత్రమే కాకుండా సుమంత్, సుశాంత్ కూడా పలు సినిమాలలో నటించారు.
ఎన్టీ రామరావు తన భార్య పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ను నిర్మించగా, ఏయన్ఆర్ తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. వీరిద్దరి భార్యలు వీరి కన్నా ముందు మరణించారు. ఎన్టీ రామరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఏయన్ఆర్ తో సంప్రదించారు. ఏయన్ఆర్ ని పాలిటిక్స్ లోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు ఆరోగ్య సమస్యల వల్ల రాలేనని, ఎన్టీ రామరావుకు అభినందనలు తెలిపారు.
ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరు అభిప్రాయభేదాలతో చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తరువాత మళ్ళీ కలిసిపోయారు. ఎంతో అనుబంధం ఉన్న వీరిద్దరు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా, ఏరోజు బహిరంగంగా నిందించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి క్రమశిక్షణ, స్టార్డమ్ నేర్పిన ఈ లెజండరీ నటులిద్దరూ జనవరి నెలలోనే తుదిశ్వాస విడిచారు.




యాంకర్ సుమ తెలుగులో టాప్ మరియు స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ చాలా బిజీగా ఉండే, అత్యంత కాస్ట్లీ మరియు టాలెంటెడ్ యాంకర్. యాంకర్ లలో ఎక్కువగా సంపాదిస్తున్న యాంకర్ కూడా సుమనే అని చెప్పవచ్చు. ఒక వైపు షోస్, మూవీ ఈవెంట్స్ చేస్తూ, మరోవైపు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే, సుమ, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి, 24 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సుమ కెరీర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ లో, సినిమాలలో నటించింది. ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ క్రమంలోనే సుమ దేవదాస్ కనకాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం, అది కాస్త ప్రేమ, ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లింది. వీరి పెళ్లి 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. ఈ జంటకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సుమ తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పెళ్లి కార్డ్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ కి ” మీరు కార్డు చదివారా?