మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించబోయే మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫ్లాప్ హీరోయిన్లకు కూడా తన సినిమాలలో అవకాశం ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, కొన్ని సంవత్సరాల కిందట బ్రూస్ లీ అనే మూవీలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రూస్ లీ మూవీ 2015లో అక్టోబరు 16న రిలీజ్ అయ్యి, ఫ్లాప్ గా నిలిచింది.
అయితే ఆ తరువాత కాలంలో రామ్ చరణ్ డైరెక్షన్ లో ధృవ మూవీలో నటించారు. ఈ మూవీలో రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ ఫ్లాప్ అయిన ఆ మూవీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ధృవ మూవీలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను పాటిస్తూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఎందుకంటే 2019లో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ హీరోయిన్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో నెట్టింట్లో రామ్ చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్లను పట్టించుకోరని, అందువల్లే ఫ్లాప్ మూవీ హీరోయిన్లకు తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు.
Also Read: హీరో అక్కినేని నాగార్జున సోదరి.. హీరో సుశాంత్ తల్లి నాగసుశీల పై కేసు..

అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన కుమారుడు సుశాంత్ హీరోగా పలు చిత్రాలను నిర్మించారు. కరెంట్, అడ్డా, కాళిదాసు, ఆటాడుకుందాం రా వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఈ చిత్రాలకు నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దాంతో నాగసుశీల, శ్రీనివాసరావుకు 2017లో విబేధాలు వచ్చాయి. వీరిద్దరు పార్టనర్స్ గా ఉండి, కొన్న ల్యాండ్ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. నాగసుశీల నాంపల్లి 2017లో చింతలపూడి శ్రీనివాసరావు మీద కోర్టులో కంప్లైంట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీనివాసరావు నాగసుశీల తన మీద తప్పుడు కేసులు పెట్టారని మీడియాకు చెప్పారు. నాగసుశీల శ్రీనివాసరావు పై సరి అయిన ఆధారాలు చూపించకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు నిర్మాత నాగసుశీల పై అదే శ్రీనివాసరావు కేసు పెట్టాడు. నాగసుశీలతో పాటు మరో పన్నెండు మంది తన పై అటాక్ చేశారని శ్రీనివాసరావు తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
శ్రీనివాసరావు, నాగసుశీలతో కలిసి కొనుగోలు చేసిన భూములను అప్పుడే పంచుకున్నామని, తన వాటా భూమిని ఒక ఆశ్రమానికి డొనేట్ చేశానని, ఆ స్థలంలో ప్రస్తుతం ఆశ్రమం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కానీ నాగసుశీల ఆ భూమి తనదేనని ఇప్పుడు గొడవ చేస్తున్నారని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. నాగసుశీల, ఆమె కుమారుడు సుశాంత్, బౌన్సర్లు, కొంత మంది వచ్చి దౌర్జన్యం చేశారని, గొడవ చేశారని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నారు.
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం, కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్‌కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.
ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.









సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘7:11 పీఎం’ జులై 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, హంసలదీవి అనే గ్రామంలో 1999 సంవత్సరంలో రవి ప్రసాద్ (సాహస్) ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ, ఐపీఎస్ సాధించాలని సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. రవి, విమల (దీపికా రెడ్డి) ప్రేమించుకుంటారు. రాజేశ్ అనే వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఒక ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ ఊరిలోని ప్రజలందరిని మోసం చేయడానికి రెడీ అవుతాడు.
ఆ మోసాన్ని తెలుసుకున్న రవి అతన్ని అడ్డుకొనే ప్రయత్నంలో అనుకోకుండా ఒక బస్సు ఎక్కుతాడు. నిద్ర లేచే సరికి రవి మెల్బోర్న్లో ఉంటాడు. అక్కడ కాలం 2024 లో నడుస్తూ ఉంటుంది. అసలు ఆ ఊరికి టైమ్ మిషన్ ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ టైమ్ మిషన్ ఎక్కాల్సి వచ్చింది? అతను తిరిగి తన కాలానికి వెళ్లాడా? తాను ప్రేమించిన విమలను కలిశాడా లేదా? అనేదే మిగిలిన కథ.
డైరెక్టర్ చైతూ మాదాల సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అయితే ఆ పాయింట్‌ను కథగా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. అయితే మొదటి సినిమా దర్శకుడిగా స్టోరీని డీల్ చేసిన తీరు, పలు క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు బాగుంది. పాత్రల్లో సహజత్వం కనిపిస్తుంది. హీరో సాహస్ చక్కటి నటనను ప్రదర్శించాడు. హీరోయిన్ దీపిక పాత్ర పరిధి మేరకు నటించింది.









