స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’. మంచి కథ కథనాలతో మొదలైన ఈ సీరియల్ ఆడియెన్స్ హృదయాలని గెలుచుకుంది. సమస్యల వలయంలో చిక్కుకున్న తన కాపురాన్ని చక్కదిద్దుకునే తెలివైన కోడలి స్టోరీనే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.
అయితే సీరియల్స్ ను సాధారణంగా మహిళలతో పాటు కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా చూస్తుంటారు. వారిలో పిల్లలు కూడా ఉంటారు. గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదట్లో ఆసక్తికరంగా సాగిన ఇంటింటి గృహలక్ష్మిని అభిమానించే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సినియర్ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ కూడా తెచ్చుకునేది. అయితే రాను రాను కథలో వచ్చిన మార్పులతో, కొత్త కొత్త క్యారెక్టర్లతో, సాగగదీసిన డైలాగ్స్ తో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతున్న ఈ సీరియల్, ఆ మధ్యన సామ్రాట్ క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్, విమర్శలు తీవ్రంగా వచ్చాయి. దాంతో ఆ పాత్రను అర్ధాంతరంగా తొలగించారు.
అయితే ఈ సీరియల్ లో గత కొన్నిరోజులుగా ప్రసారం అవుతున్న ఎపిసోడ్ల పై ఆడియెన్స్ మండిపడుతున్నారు. సీరియల్స్ అంటే కుటుంబంలోని వారంతా కలిసి చూస్తారని, అందులో పిల్లలు కూడా ఉంటారని, అలాంటి సీరియల్స్ లో కూడా ఎక్స్ పోజింగ్ హద్దులు దాటుతోందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలలో, ఓటీటీల్లో వలె అడల్ట్ కంటెంట్ చూపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఒకవైపు సామ్రాట్ చనిపోయడని, దండ వేసిన సామ్రాట్ ఫొటోను చూస్తూ, తులసి భోరు భోరున ఏడుస్తూ కూర్చుంది. మరో వైపు తులసి కూతురు దివ్యను బీగ్రేడ్ సినిమాలలో చూపించారని కామెంట్స్ చేశారు. ఇలాంటి సన్నివేశాలు చూపిస్తే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఫ్యామిలీ చూస్తారనే ఇంగితం కూడా లేదా అని తిడుతున్నారు.
Also Read: హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ వ్యక్తికి ఏమైంది..? అతని ఫెయిల్యూర్ కి కారణాలు ఇవేనా..?

ఇప్పటికి కూడా ఈ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంది. అందుకే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన కామెడీ సీన్స్ కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో నటించారు. అప్పటి వరకు మూతపడ్డ థియేటర్లని తెరిపించి కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో నవీన్ మాట్లాడిన డైలాగ్స్, మేనరిజమ్స్ విపరీతంగా ఇమిటేట్ చేస్తారు.




సినిమాల్లో చాలా ట్విస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో దానికన్నా ఎక్కువ ట్విస్టులే ఊహించని విధంగా వస్తుంటాయి. దానితో ఎక్కడో ఉండాల్సిన జీవితం మారెక్కడీకో మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ లైఫ్ కూడా ఇలాంటిదే. సౌత్‌లో వందకు పైగా చిత్రాలలో నటించిన కార్తీక్ టాప్ హీరోగా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కార్తీక్ అసలు పేరు మురళి కార్తికేయన్ ముత్తురామన్. ఆయన తండ్రి కోలీవుడ్ లో గొప్ప యాక్టర్ ఆర్ ముత్తురామన్. మచ్చలేని మనిషిగా పేరు గాంచారు.
నటనను తండ్రి నుండి వారసత్వంగా పొందిన కార్తీక్ భారతీరాజా దర్శకత్వం వహించిన అలైగళ్ ఒవతిల్లై అనే మూవీతో 1981లో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీక్ లుక్స్, నటన మెచ్చిన దర్శకులు తమ చిత్రాలలో నటించమని వెంటపడ్డారు. అలా అతి తక్కువ టైమ్ లోనే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. సీతాకోక చిలుక మూవీ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి, అభినందన లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. తమిళంలో సంవత్సరానికి 8-10 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో కార్తీక్ తెలుగులో ఎక్కువగా నటించలేకపోయాడు. అయినా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హీరో కార్తీక్ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభినందన మూవీకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్న తరువాత నుండే కార్తీక్ కెరీర్ పడిపోవడం మొదలైంది అంటారు.
కార్తీక్ తరచూ ఎవరో ఒక హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా వార్తలు వినిపించేవి. ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ ఇద్దరు పిల్లలు. అయితే ఆ తరువాత టం ఇంట్లోనే ఉంటున్న భార్య చెల్లెలు రతితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా, రతి ప్రెగ్నెంట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత రతిని రెండవ వివాహం చేసుకున్నాడు. దాంతో కార్తీక్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కార్తీక్‌పై అతని తోబుట్టువులు కేసు వేశారు. తండ్రి ముత్తురామన్ ఆస్తులలో తమ హక్కును కోరుతూ కేసును వేశారు.
ఆ సమయంలో కార్తీక్ సినిమాల పై దృష్టి పెట్టలేకపోయాడు. అది కూడా ఒక కారణం. కార్తీక్ షూటింగ్ స్పాట్ ఆలస్యంగా రావడం అలవాటు, దాంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతని వల్ల రమేష్ కన్నా అనే దర్శకత్వం వహించిన తొలి మూవీ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఆల్కహాల్ మరియు డ్రగ్స్ కు బానిస. ఈ చెడు వ్యసనాల వల్లే తన కెరీర్ పతనం అయ్యిందని స్వయంగా కార్తీక్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.













“భోళా శంకర్ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని కోరాలో అడుగగా, దానికి
ఎప్పుడో ఎన్టీఆర్, ఎన్ ఆర్ లు యంగ్ హీరోయిన్లతో తైతక్కలాడితే అప్పట్లో కొత్త, ఇంకా వేరే దిక్కులేక చూసారు. మనవరాళ్ల వయసు వారితో అది ఇంత మంది యంగ్ స్టర్స్ ఉండగా, ఆ వెకిలి డాన్సులు చేస్తే సీనియర్ అభిమానులమైన మాకే వెగటు పుట్టేస్తుంది. ఇక ఆ వేదాలమే రొడ్డ సినిమా. మళ్ళీ దాన్ని 8 ఏళ్ల తరువాత మ్యూజియం లో నుండి బయటకు తీసి, కళా తపస్వి , కళా సృష్టి కర్త అయిన మెహర్ రమేష్ లాంటి దర్శక దిగ్గజానికి ఇచ్చి తెలుగు ప్రేక్షకుల పైకి వదలడం ఏమి న్యాయమో చిరంజీవి గారు ఆలోచించాలి.
నిజంగా రీమేక్ లు ఇష్టమయితే చిరంజీవి గారి పాత సినిమాలే రీమేక్ చేస్తే బెస్ట్ ఎందుకంటే అవి ఎవర్ గ్రీన్ సబ్జెక్స్. ఇంత ఫ్రస్ట్రేషన్ చూపించిన నేను సినిమా చూసానా అంటే లేదు. ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ఎంత పొడవాటి బాకు ప్రేక్షకుల హృదయాలను తాక బోతున్నాయో అని. వృద్దాప్యాన్ని హుందాగా అంగీకరించి, కళా తృష్ణ తీర్చుకునే సినిమాలు చేస్తే మంచిది. కాదు ఇంకా మేము ఇరవైల్లోనే ఉన్నాం అనుకుంటే” అంటూ రాసుకొచ్చారు.




యంగ్ హీరో నాగ చైతన్య , తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా, బన్నీవాసు నిర్మించారు. 2011 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీలోనీ ఐటమ్ సాంగ్ లో నటించిన నటి పేరు మరియం జకారియా. ఈమె ఇరానియన్-స్వీడిష్ నటి. మరియం బాలీవుడ్, తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.
మరియం స్వీడన్లో మోడల్‌గా, డ్యాన్స్ టీచర్‌గా మరియు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే స్వీడన్లో ఇండిస్క్ డాన్స్ స్టూడియోను స్థాపించారు. ఆమె బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసం 2009లో ముంబైలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు యాడ్స్ లో నటించారు. కోకోకోలా యాడ్ లో ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించారు. తమిళ దర్శకుడు సుందర్ సి. ఆమె డ్యాన్స్ ను యూట్యూబ్‌లో చూసి తన మూవీ నగరం (2010)లో ఐటెమ్ సాంగ్ లో ఛాన్స్ ఇచ్చారు.
ఆ తరువాత 100% లవ్ మూవీలో ఆఫర్ రావడంతో “డియ్యాలో డియ్యాలా”లో చేసింది. దాంతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అల్లరి నరేష్‌తో మడత కాజాలో ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో వచ్చిన గ్రాండ్ మస్తి మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. తన డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.