సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ. కొంత మంది నటులు పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వస్తారు. కొంత మంది నటులు చిన్నప్పుడు సినిమాల్లో నటించి, ఆ తర్వాత కొంత విరామం తీసుకొని, మళ్లీ సినిమాల్లోకి వస్తారు. కానీ కొంత మంది నటులు మాత్రం, చిన్నప్పటినుండి పెద్ద అయ్యేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, లీడ్ పాత్రల్లో, సహాయ పాత్రల్లో, ముఖ్య పాత్రల్లో, అలా తమ వయసుకి సూట్ అయ్యే పాత్రల్లో నటిస్తూ వెళ్తూ ఉంటారు.

అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వారు ప్రేక్షకులకు చాలా బాగా చేరువవుతారు. వారి భాషల ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు పైన ఫోటోలో ఉన్న అబ్బాయి కూడా చాలా పెద్ద హీరో అయ్యారు. సావిత్రి గారితో ఉన్న ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా? కమల్ హాసన్ తెలియని వారు ఉండరు. కమల్ హాసన్ తమిళ్ వారు. కానీ తెలుగులో కమల్ హాసన్ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయన నటించిన స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాలని ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. ఆయన నటన చాలా మందికి టెక్స్ట్ బుక్ లాంటిది. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కమల్ హాసన్ ముందుగా మాట్లాడుకునే నటుడు.
విక్రమ్ సినిమాకి ముందు కమల్ హాసన్ బర్త్ డే రోజు ఒక వీడియో విడుదల చేశారు. అందులో కమల్ హాసన్ కళ్ళతోనే ఒక ఎక్స్ప్రెషన్ పలికిస్తారు. వీడియో విడుదల అయ్యాక ఆ ఎక్స్ప్రెషన్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు కమల్ హాసన్ పాత్ర సినిమాలో ఎలా ఉంటుంది అనే విషయం తెలిసిపోతుంది. కమల్ హాసన్ మంచి నటుడు మాత్రమే కాదు. గాయకుడు, నృత్య కళాకారుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. దశావతారం సినిమాలో కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి సాహసం చేయాలి అనే ఆలోచన రావడమే చాలా గొప్ప. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటించారు. ఈ సినిమా భారతీయుడు 2 పేరుతో తెలుగులో కూడా విడుదల అవుతుంది.




కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read:
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్‌తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.




