ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉండి, వివిధ రకమైన పాత్రలు పోషించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హేమ. హేమ అసలు పేరు కృష్ణవేణి. హేమ తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందినవారు. ఏడవ తరగతి వరకు చదువుకున్న హేమ తర్వాత చదువులు ఆపేశారు. చిన్నప్పటి నుండి కూడా హేమాకి నటన అంటే ఆసక్తిగా ఉండేది. 1989 లో వచ్చిన చిన్నారి స్నేహం సినిమాలో హేమ మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, పల్నాటి రుద్రయ్య, ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నిటిలో కూడా హేమ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు.

హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి సినిమాలు చేస్తూనే ఉన్నారు. హేమ సీరియస్ పాత్రలతో పాటు, కామెడీ పాత్రలు కూడా బాగా చేస్తారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. సయ్యద్ జాన్ అహ్మద్ తండ్రి ఎస్ డి లాల్ గారు అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. సయ్యద్ జాన్ అహ్మద్ కెమెరామెన్ గా చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందారు. సయ్యద్ జాన్ అహ్మద్ ఒకసారి హేమతో మాట్లాడుతున్నప్పుడు తనని పెళ్లి చేసుకోమని అడిగారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు ఈషా. పెళ్లయ్యాక కొన్ని సంవత్సరాలు పాటు హేమ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మురారి సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా హేమకి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో హేమ ఐదు నెలల గర్భవతిగా ఉన్నారు. అయినా కూడా ఆ సమయంలో నటించారు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా హేమకి గుర్తింపు తెచ్చాయి. ఎక్కువగా కామెడీ రోల్స్ లో హేమ చేసేవారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో హేమ నటనకి నంది అవార్డు అందుకున్నారు.
ఒక సందర్భంలో హేమ తన కుటుంబం గురించి మాట్లాడుతూ, తన భర్తకి చాలా సిగ్గు ఎక్కువ అని అందుకే ఇంటర్వ్యూలకి రారు అని చెప్పారు. కూతురి గురించి కూడా మాట్లాడుతూ, తన కూతురికి సినిమాలు అంటే ఆసక్తి లేదు అని అన్నారు. అందుకే కెమెరా ముందుకి ఎక్కువగా తీసుకువెళ్లట్లేదు అని అన్నారు. ఒకవేళ, ఆ అమ్మాయి హేమ కూతురు అని తెలిస్తే ఆ తర్వాత తను స్వేచ్ఛగా బయటికి వెళ్లలేదు అని, అందుకే పెద్దయ్యాక హేమ కూతురు ఫోటోలు కూడా ఎక్కడ పోస్ట్ చేయట్లేదు అని చెప్పారు.


ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్‌ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్‌తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్‌తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్‌బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్‌ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్‌లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.




















