సినిమా బడ్జెట్ ఒక్కొక్కసారి తక్కువగా ఉన్నా కూడా, వచ్చే కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. చిన్న బడ్జెట్ సినిమాలు వస్తాయి. కానీ పెట్టిన బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ లాభాలు ఆ సినిమాలు చేస్తాయి. అందుకు కారణం, వాటిల్లో ఉన్న కంటెంట్. చాలా సినిమాలు అలాగే చేశాయి. ఈ సినిమా కూడా అలాగే 25 కోట్లు పెట్టి తీశారు. కానీ దాదాపు 359 కోట్లు ఈ సినిమా వసూలు చేసింది. భారతదేశమంతా గర్వపడేలా ఈ సినిమా చేసింది. ఈ సినిమా నేషనల్ అవార్డులు కూడా తెలుసుకుంది. ఊరి (URI) సినిమా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాగా విడుదల అయ్యి, తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది.

విక్కీ కౌశల్, యామి గౌతమ్ నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా ఈ సినిమాని నిర్మించారు. సినిమా మొత్తం ఐదు చాప్టర్లుగా నడుస్తుంది. దేశభక్తి మీద, నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీద ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. సైనికులు తమ కుటుంబాన్ని విడిచి వెళ్లి దేశం కోసం ఎంత పోరాడుతారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నటీనటుల నటనకి చాలా ప్రశంసలు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆడియోగ్రఫీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగాల్లో ఈ సినిమా నాలుగు నేషనల్ అవార్డులను అందుకుంది.
అలాగే ఆ సంవత్సరం వచ్చిన ప్రతి సినిమా ఈవెంట్ లో ఒక్క అవార్డు అయినా ఈ సినిమా అందుకుంది. విక్కీ కౌశల్ ని స్టార్ హీరో చేసింది ఈ సినిమా. 2019 లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి కూడా బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలు అంటేనే అందరికీ అదొక రకమైన ఆసక్తి ఉంటుంది. దేశం అంటే ఎంత గౌరవిస్తారు అనేది ఈ సినిమాల్లో చూపిస్తారు. ఈ సినిమాలో ఈ విషయాన్ని చాలా బాగా చూపించడంతో అందరూ ప్రశంసించారు.









2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్‌రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్










‘కల్కి 2898 ఏడి’ గ్లింప్స్ లో కనిపించిన కోలీవుడ్ యాక్టర్ పేరు పశుపతి. ఇతను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు. తమిళంలో అనేక సినిమాలలో నటించి, మెప్పించాడు. పశుపతి నటించిన చాలా పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రధాన పాత్రలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కామెడీ పాత్రలలో నటించిన విలక్షణ నటుడు పశుపతి.
పశుపతి చెన్నైలోని వన్నందురైలో 1967లో జన్మించారు. 1984లో, చెన్నైలోని ” కూత్తు-పి-పట్టరై ” అనే థియేటర్ గ్రూప్‌లో చేరాడు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టేవరకు అక్కడే ఉన్న పశుపతికి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న యాక్టర్ నాజర్‌తో స్నేహం ఏర్పడింది. నాజర్ ద్వారా పశుపతి కమల్ హాసన్‌కి పరిచయం అయ్యాడు. అలా కమల్ హాసన్ నటిస్తున్న మరుదనాయగంలో విలన్ పాత్రకి సెలెక్ట్ అయ్యాడు. అదే పశుపతి మొదటి సినిమా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తరువాత వేరే చిత్రాలలో అవకాశాలు రావడంతో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. పశుపతి కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. డైరెక్ట్ తెలుగు సినిమాలలో కూడా నటించారు. మొదటిసారి రవితేజ హీరోగా 2003లో వచ్చిన ‘వీడే’ మూవీలో సీనియర్ నటి నళిని స్వర్ణక్కగా నటించగా, ఆమె తమ్ముడిగా పశుపతి నటించాడు. ఆ తరువాత ఆంధ్రావాలా, నేనున్నాను, అనామిక, మలుపు, రాజా విక్రమార్క పశుపతి నటించారు.







