డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’. రిలీజ్ కు ముందు నుండి ఈ చిత్రం విమర్శలకు, వివాదాలకు గురవుతోంది. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే. జూన్ 16న మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఆదిపురుష్ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
కొందరు ఆదిపురుష్ పై సానుకూలంగా స్పందిస్తుంటే, చాలామంది రామాయణాన్ని ఆదిపురుష్ పేరుతో అపహాస్యం చేస్తున్నారని, ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ చిత్రాన్ని తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం రావడంతో చిత్రబృందం ఆ డైలాగ్స్ ను మార్చిన సంగతి తెలిసిందే. మూవీలోని కొన్ని సన్నివేశాల పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఇంద్రజిత్ సీతాదేవి గొంతు కోసినట్టు ఒక సీన్ లో చూపించారు. ఇది ఫిక్షన్. కొందరు రాజకీయ నేతలు ఏవేవో ఊహించుకుని రామాయణం మార్చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. “ఆదిపురుష్ మూవీ చూసిన అనంతరం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ” ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ పై సెహ్వాగ్‌ను కొందరు ట్రోల్ చేస్తుంటే, కొందరు కాస్త బెటర్‌గా తీయాల్సింది అని సెహ్వాగ్ కు మద్ధతిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీని అంగీకరించినందుకే బాహుబలి (ప్రభాస్)ను కట్టప్ప చంపాడు అనే అర్థంతో ఈ ట్వీట్ చేశారని ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్నారు. అరె మీరూ మొదలుపెట్టారా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు.













#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12








ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన యాక్టర్ పేరు వత్సల్ శేత్. 1980 లో ఆగస్టు 5న వత్సల్ సేథ్ జన్మించాడు. వత్సల్, ఉత్పల్ షాంఘ్వీ గ్లోబల్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, ముంబైలోని విలే పార్లేలోని గోకలిబాయి పునమ్చంద్ పీతాంబర్ హైస్కూల్లో తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. ముంబైలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా పొందారు. వత్సల్ మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.
కాని జస్ట్ మొహబ్బత్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు టెలివిజన్ షోలలో నటించారు. ఆ ఆతరువాత బాలీవుడ్ సినిమాలలోనూ నటించాడు. 2004లో వచ్చిన టార్జాన్: ది వండర్ కార్ అనే చిత్రంలో రాజ్ చౌదరి అనే పాత్రను చేశాడు. ఇదే అతని మొదటి సినిమా. 2014లో వచ్చిన థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీ, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో నటించి పాపులర్ అయ్యాడు. వత్సల్ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా.
2020లో వత్సల్ శేత్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 36వ ప్లేస్ లో నిలిచాడు. వత్సల్ శేత్ తన సహనటి ఇషితా దత్తాను 2017 లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట తరచు విహారయాత్రలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ గా నటించి, తెలుగు ఆడియెన్స్ కి ముందుకు వచ్చారు.







“ఆది పురుష్ మూవీ చూసారా.. చూస్తే మీ అభిప్రాయం పంచుకోగలరు” అని అడిగిన ప్రశ్నకు కిరణ్ అనే యూజర్ ఆదిపురుష్ ఇంద్రజిత్ పాత్ర ఫోటోను షేర్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చారు. “ఈ వ్యక్తి పూరీ జగన్నాధ్ చిత్రాలలో బ్యాంకాక్ లో తప్పుడు పదార్ధాలు అమ్మేవాడిలా ఉన్నాడు. రావణుడి కుమారుడు అయిన ఇంద్రజిత్ కి ఈ టాటూలు ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో అర్ధం కావట్లేదని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా దర్శకుడు ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ పేరుతో రావణుడితో వెల్డింగ్ వర్క్, అనకొండలతో మసాజ్ చేయించుకున్నట్లు ఇలాంటివి చాలానే చేయించాడు. రామాయణ క్యారెక్టర్ల ఔచిత్యాన్ని తగ్గించేలా తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని ఇంతగా వక్రీకరించి తియ్యాలనే ఆలోచన ఓం రౌత్ ఎలా వచ్చిందో తెలియదు.