ఏషియన్ సినిమాస్ ప్రముఖ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సంస్థ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఆధునిక హంగులతో ‘ఏఎంబీ’ మల్టీప్లెక్స్ ను గచ్చిబౌలిలో నిర్మించారు.
ఇటీవల ఏషియన్ సంస్థ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ‘ఎఎఎ’ సినిమాస్ పేరుతో నిర్మించిన మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. అయితే ఈ రెండు మల్టీప్లెక్స్ లను పోలుస్తూ, రెండింటిలో ఏఎంబీ సినిమాస్ బెటర్ అని అంటున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఏఎంబీ సినిమాస్ ఒకటి. ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. మహేష్ ఇమేజ్ ఈ మల్టీప్లెక్స్ కు ప్లస్ గా మారింది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో చాలా ప్రత్యేకతలు ఉండటంతో కొత్త సినిమాల ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే చిత్రాలకు సంబంధించిన చిన్నచిన్న వేడుకలను కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు.
ఇటీవల అమీర్ పేట్ లో అల్లు అర్జున్ ‘ఎఎఎ’ సినిమాస్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో ఎఎఎ మల్టిప్లెక్స్ ను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎఎఎ సినిమాస్ ను ఏఎంబీ సినిమాస్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఎఎఎ మల్టీప్లెక్స్ బాగానే ఉన్నప్పటికీ, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ మెట్టు పైనే ఉందని ఈ రెండు మల్టీప్లెక్స్ లలో మూవీస్ చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.
ఎఎఎ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఉన్న ఎల్ఈడీ లైట్ల వెలుగు కళ్ళకు ఇబ్బంది కలిగేలా ఉందని అంటున్నారు. ఇందులో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిదిద్దితే ఎఎఎ సినిమాస్ కు ఎదురు ఉండదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ అమీర్ పేట్ లో నిర్మించడం ప్లస్ గా మారింది.
Also Read: తమ సినిమాల్లో తామే నటించిన 11 మంది డైరెక్టర్లు…వీరిలో ఎంతమందిని మీరు గమనించారు?




హనుమంతుడి డైలాగ్స్ పై తీవ్ర అభ్యంతరం రావడంతో చిత్రబృందం ఆ డైలాగ్స్ ను మార్చిన సంగతి తెలిసిందే. మూవీలోని కొన్ని సన్నివేశాల పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇక ఇంద్రజిత్ సీతాదేవి గొంతు కోసినట్టు ఒక సీన్ లో చూపించారు. ఇది ఫిక్షన్. కొందరు రాజకీయ నేతలు ఏవేవో ఊహించుకుని రామాయణం మార్చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. “ఆదిపురుష్ మూవీ చూసిన అనంతరం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ” ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ పై సెహ్వాగ్‌ను కొందరు ట్రోల్ చేస్తుంటే, కొందరు కాస్త బెటర్‌గా తీయాల్సింది అని సెహ్వాగ్ కు మద్ధతిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీని అంగీకరించినందుకే బాహుబలి (ప్రభాస్)ను కట్టప్ప చంపాడు అనే అర్థంతో ఈ ట్వీట్ చేశారని ప్రభాస్ అభిమానులు సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్నారు. అరె మీరూ మొదలుపెట్టారా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు.











#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12








ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన యాక్టర్ పేరు వత్సల్ శేత్. 1980 లో ఆగస్టు 5న వత్సల్ సేథ్ జన్మించాడు. వత్సల్, ఉత్పల్ షాంఘ్వీ గ్లోబల్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, ముంబైలోని విలే పార్లేలోని గోకలిబాయి పునమ్చంద్ పీతాంబర్ హైస్కూల్లో తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. ముంబైలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా పొందారు. వత్సల్ మొదట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.
కాని జస్ట్ మొహబ్బత్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు టెలివిజన్ షోలలో నటించారు. ఆ ఆతరువాత బాలీవుడ్ సినిమాలలోనూ నటించాడు. 2004లో వచ్చిన టార్జాన్: ది వండర్ కార్ అనే చిత్రంలో రాజ్ చౌదరి అనే పాత్రను చేశాడు. ఇదే అతని మొదటి సినిమా. 2014లో వచ్చిన థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీ, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో నటించి పాపులర్ అయ్యాడు. వత్సల్ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా.
2020లో వత్సల్ శేత్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 36వ ప్లేస్ లో నిలిచాడు. వత్సల్ శేత్ తన సహనటి ఇషితా దత్తాను 2017 లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట తరచు విహారయాత్రలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ గా నటించి, తెలుగు ఆడియెన్స్ కి ముందుకు వచ్చారు.





