ఒక సీరియస్ ఇష్యూ ని కూడా సరదా చెప్పడం డైరెక్టర్ మారుతీ స్టైల్. ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత శోభన్ సంతోష్ హీరోగా చేసిన మంచిరోజులు వచ్చాయి మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
అందుకే నెక్ట్ ప్రాజెక్ట్ కమర్షియల్ గా ఉండాలి అని పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టి హీరో మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ రాశీఖన్నాతో సినిమా తీసాడు మారుతీ. అయితే ఈ సినిమాకు మొదటి హీరోగా మాస్ మహా రాజ్ రవితేజ ను అనుకున్నాడంటా మారుతీ. యూవీ క్రియేషన్స్, జీ2 పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. 
దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారంటా.. ఈ ప్రాజెక్ట్ వదులుకొని రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఖిలాడి లో నటించాడు. అటు హిందీ, ఇటు తెలుగులోను పెద్దగా వసూళ్లు రాబట్టలేదు ఖిలాడి. రవితేజ మారుతీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడానికి కారణం మాత్రం తెలీదు. దీనిపై మారుతీ కానీ, రవితేజ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 
ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నాడు. ఒక వైపు మారుతీ సినిమాలతో పాటు ఈ మధ్య 3 రోజెస్ అనే ఓ వెబ్ సిరీస్ కి రైటర్ గా కూడా చేసాడు. తర్వాత మారుతీ డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.








బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్లు నటించారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి కోసం ఒక సీటు కేటాయించాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కోరడం ద్వారా ఆదిపురుష్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టారు. రామాయణ పారాయణం చేసినా, రాముడి కథను ప్రదర్శించినప్పుడు ఆ స్థలంలో హనుమంతుడు ఉంటాడని తన తల్లి చెప్పేదని, ఆ విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పాడు.
ఓం రౌత్ చెప్పినట్లుగానే థియేటర్లలో హనుమంతుడి కోసం సీటును కేటాయించడం, ఆ సీటులో హనుమంతుడి ఫోటో పెట్టి పూజించడం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల వేషధారణను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓం రౌత్ 2015లో చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
ఓం రౌత్ ‘హనుమంతుడు చెవిటివాడా? నా బిల్డింగ్ చుట్టు ఉన్న వాళ్ళు హనుమాన్ జయంతి రోజు చాలా పెద్ద సౌండ్ పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు అన్నీ అసంబద్ధమైన పాటలు.” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రస్తుతం నెటిజెన్లు మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడు కోసం ఒక సీటు రిజర్వ్ అని చెప్పిన ఓం రౌత్, అప్పుడేమో ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.























































































“విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది.”
“నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరి లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది.”

