సెన్సేషనల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు, రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా రూపొందిన సినిమా ‘అహింస’. ఈ చిత్రాన్ని పి.కిరణ్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా గీతికా తివారి నటించింది. జూన్ 2న అహింస మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు చూసినపుడు మరో జయం మూవీ అనే భావన కలిగింది. అయితే మొదటి సినిమా కావడంతో హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎలా నటిస్తారో అనే ఆసక్తిగా మీడియాలో కనిపించింది. తొలి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ప్రేమకథ సినిమాల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ తేజ. అలాంటి తేజ దర్శకత్వంలో దగ్గుబాటి కుటుంబం నుండి వెంకటేష్, రానా అనంతరం అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీ పై ఆసక్తిని పెంచింది. కానీ రీలజ్ అయిన మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల అని తెలుస్తోంది.
వారం రోజుల అహింస వసూళ్ల వివరాలను చూస్తే, తొలి రోజు 30 లక్షలు, 2వ రోజు 29 లక్షలు, 3వ రోజు 31 లక్షలు, 4వ రోజు 26 లక్షలు, 5వ రోజు 24 లక్షలు, 6వ రోజు 26 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ మూవీ 1.66 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి థియేట్రికల్‌గా జర్నీ క్లోజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
వరల్డ్ వైడ్ కలెక్షన్ల చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 10 లక్షలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ 2 కోట్ల గ్రాస్ ను, 80 లక్షల షేర్ ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం, 5 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: బాలయ్య బోయపాటి శ్రీను మూవీ అలా ఉండబోతుందా..?