భారతీయ సినిమా ఇండస్ట్రీ అంటే తమ అభిమాన హీరో హీరోయిన్లని ప్రేక్షకులు దేవుళ్లతో సమానంగా చూస్తారు. అందుకే వారికి గుళ్ళు కట్టడం, వారి పోస్టర్లకి, కట్ అవుట్ లకి పాలతో అభిషేకం చేయడం వంటివి మన దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి.
కానీ ఎంత అభిమానులు అయినా సరే తమ అభిమాన హీరోయిన్లు చేసే కొన్ని పనులు మాత్రం నచ్చకపోతే అంతే బహిరంగంగా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం లేని వ్యక్తి. కాజోల్ హిందీలో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. తర్వాత హీరో అజయ్ దేవగన్ తో పెళ్లి అయ్యాక కొద్ది సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉన్నారు.

మళ్లీ ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే కాజోల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాజోల్ సోషల్ మీడియాలో చాలా సరదాగా ఉంటారు. తన ఫొటోస్ కి కామెడీగా ఉంటే క్యాప్షన్స్ పెట్టి షేర్ చేస్తారు. అందుకే కాజోల్ కి సోషల్ మీడియాలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

అయితే ఇదిలా ఉండగా కాజోల్ నిన్న సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు. అంతే కాకుండా తాను తన జీవితంలో ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అని ఒక పోస్ట్ షేర్ చేసి, సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో చాలా మంది, “కాజోల్ కి ఏమయ్యింది?” అని ఆందోళన పడ్డారు. కొంత మంది మాత్రం కాజోల్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేశారు. అయితే కాజోల్ ఇలా పోస్ట్ చేసిన కొంచెం సేపటికి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని తెలిసింది.

ఇది కాజోల్ నెక్స్ట్ సిరీస్ అయిన ద ట్రైల్ అనే ఒక షో కి పబ్లిసిటీ కోసం చేశారు అని అర్థం అయ్యింది. దాంతో అప్పటి వరకు కాజోల్ పోస్ట్ చూసి ఆందోళన పడిన వాళ్లే ఈ పోస్ట్ చూశాక, “షో కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా?” అంటూ కామెంట్స్ చేశారు. ఏదేమైనా సరే ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంక కాజోల్ చేస్తున్న ద ట్రయల్ విషయానికి వస్తే ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తోంది.
ALSO READ : సినిమా ఇండస్ట్రీలో తల్లి కూతుర్లు…లిస్ట్ లో ఉన్న 10 మంది ఎవరో లుక్ వేయండి.!




మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వీరిద్దరు ఐదేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. వరుణ్, లావణ్య 2017లో మిస్టర్ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. గత రెండు సంవత్సరాల నుండి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే 2 రోజుల క్రితం ఎంగేజ్మెంట్ గురించి అఫిషియల్ గా ప్రకటించారు.
మణికొండలోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరుగింది. శుక్రవారం (జూన్ 9) సాయంత్రం వరుణ్-లావణ్య ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబం మొత్తం అందరు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గతంలో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడిన మాటలు ఎంగేజ్మెంట్ తరువాత వైరల్ అయ్యాయి.
లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో లావణ్య తెలుగులో మాట్లాడం చూసిన అల్లు అరవింద్, “ఈ అమ్మాయి ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఒక కుర్రాడిని చూసి పెళ్లిచేసుకుంటే బాగుంటుంది కదా” అన్నారు. ఆ వీడియో చూసినా నెటిజెన్లు అల్లు అరవింద్ చెప్పిందే నిజం ఏయినడాని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఎవరో ఒకర్ని అంటే మెగా ఫ్యామిలీలోనే చూసుకుందిగా అంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పోస్టర్, ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. కార్టూన్ యానిమేషన్ ల ఉందని, రామాయణంలా లేదని, ముఖ్యంగా రావణుడు పాత్ర పై ఎన్నో విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది.
ఆ తరువాత గ్రాఫిక్స్ పై మరింత ఫోకస్ చేసి, మార్పులు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. అయితే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివాదాలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రం పై, ప్రభాస్ లుక్స్ పై ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత సీరియల్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీనియర్ హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తున్నారు. ఆమె ప్రభాస్ ఈ మూవీలో రాముడిలా కాకుండా కర్ణుడులా కనిపిస్తున్నారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పై మండిపడుతున్నారు.
స్టోరీ :
అది ముఖ్యమైనది కావడంతో ఇంట్లో ఉన్న అందరిని అనుమానిస్తు ఉంటారు. చివరికి కూతురు ప్రేమించిన శ్రీనివాస్ ని అనుమానిస్తారు. అసలు దొంగతనం అయిన వస్తువు ఏమిటి? ఇంతకీ దొంగ ఎవరు, పోయిన వస్తువు తిరిగి దొరికిందా, ఆపైన ఆ తరువాత ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా మారాయి అనేది తెలియాలి అంటే ఇంటింటి రామాయణం చూడాల్సిందే.
రివ్యూ :
ఈ మూవీలోని రాములు క్యారెక్టర్ సీనియర్ నరేష్ మరొకసారి అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం నరేష్ పాత్ర యొక్క తీరు ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ తన పాత్రలో బాగా నటించారు. నవ్య స్వామి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, చేవెళ్ల రవి, అంజి, జీవన్ తదితరులు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. మూవీలో ఉన్న 3 సాంగ్స్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :




















