ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక చిత్రం తరువాత మరొక చిత్రం హీరోల పుట్టినరోజుల సందర్భంగా పాత చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బాలయ్య కెరీర్ లోనే కాకుండా, తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలో బెస్ట్ మాస్ మూవీగా గా నిలిచి, ప్రేక్షకుల అందరికి నచ్చిన చిత్రంగా నిలిచిన మూవీ నరసింహ నాయుడు. ఈ మూవీ 2001 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ లను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్ లో 20 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 95 కి పైగా సెంటర్స్ లో వంద రోజులు ఆడింది.
అలాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీని బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10న 2 తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నరసింహానాయుడు సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఏరియాలలో ఓపెన్ అయ్యాయి. బాలయ్య చిత్రాలకు సీడెడ్ లో హడావుడి ఎప్పుడూ ఉంటుంది. ఈ సారి అక్కడ హడావుడి ఉన్నా, అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా బుకింగ్స్ జోరుని ఏమాత్రం చూపించడం లేదు.
నైజాంలో మరియు ఆంధ్రలో కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. రాయలసీమలో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని ఏరియాలలో తప్ప మిగతా చోట్లా మాత్రం బుకింగ్స్ వీక్ గా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలయిన రీ రిలీజ్ పుట్టిన రోజు చిత్రాలలో వీకేస్ట్ బుకింగ్స్ ఈ మూవీకే అని అంటున్నారు.
Also Read: TAKKAR REVIEW : “సిద్ధార్థ్” హీరోగా నటించిన టక్కర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 27, 2023న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ సంబంధించిన పనులను మొదలు పెట్టింది. ఈ విషయం పై మేకర్స్ ప్రకటన కూడా చేశారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, సముద్రఖనితో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. బ్రో సినిమా షూటింగ్ లో సముద్రఖని టేకింగ్, వేగానికి పవన్ ఫిదా అయ్యడంట. అది మాత్రమే కాక ఈ మూవీలో పవన్ నటించే పోర్షన్ ను స్పీడ్ గా పూర్తి చేశాడట.
సముద్రఖని స్కిల్స్ నచ్చిన పవన్ కళ్యాణ్ సముద్రఖనితో మరోసారి సినిమా చేబోతున్నట్లు తెలుస్తోంది. బ్రో మూవీ రిలీజ్ అయిన తరవాత ఆ సినిమా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ కథతో మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఈ మూవీ గురించి త్వరలో అఫిషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం.












మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా జల్లికట్టు డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మలయాళ, తెలుగు బాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిలాసఫికల్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ జేమ్స్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
జేమ్స్ అనే వ్యక్తి వేలంకిని మాత దర్శనానికి తన భార్యాపిల్లలు మరియు బంధువులతో కలిసి వెళతాడు. అక్కడి నుండి బస్ లో తిరిగి వచ్చేటపుడు తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఊర్లో దిగిన జేమ్స్, నేరుగా ఒక ఇంటిలోకి వెళతాడు. తెలుగు వ్యక్తి అయిన జేమ్స్ అప్పటి నుండి తమిళంలో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులోని అందరిని వారి పేర్లతో పలకరిస్తూ, తన ఊరు అదే అని చెబుతాడు.
ఆ ఊరి నుండి 2 సంవత్సరాల క్రితం మిస్ అయ్యిన సుందరంలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. జేమ్స్లో సడెన్ గా వచ్చిన ఆ మార్పుకు కారణం ఏమిటి అనేది జేమ్స్ భార్య, బంధువులతో పాటు ఆ ఊరివాళ్లకు అర్ధం కాదు. జేమ్స్ ను తీసుకెళ్లడానికి భార్య, బంధువులు ఎంత ప్రయత్నించినా జేమ్స్ అంగీకరించడు. జేమ్స్ అసలు ఎందుకు అలా మారాడు? సుందరంగా మారిన జేమ్స్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?
జేమ్స్ తన గతాన్ని తెలుసుకొని భార్యాపిల్లలతో కలిసి వెళ్లాడా? లేదా సుందరంగా ఆ ఊరిలోనే ఉండిపోయాడా అనేదే మిగతా స్టోరి. మమ్ముట్టి అటు జేమ్స్ గా, ఇటు సుందరంగా 2 క్యారెక్టర్లలోనూ జీవించాడు. ఈ రెండు పాత్రలలో మమ్ముట్టి యాక్టింగ్, వేరియేషన్స్ అద్భుతం.


ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ వార్తలతో నిండిపోయింది.
ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విధానాన్ని చూసి, రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదిపురుష్ కి మద్ధతుగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలోని రావణుడు సీతను అపహరించే వీడియోను, ఆదిపురుష్ లో అదే సన్నివేశాన్ని పొలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
సీరియల్ లో రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కానీ ఆదిపురుష్ లో రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయకుండా తీసుకెళ్లాడు. దీనిని అందరు తప్పుగా చూపించారని అంటున్నారు. సీరియల్ తో పోలిస్తే ఆదిపురుష్ కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీతమ్మను ఎవరు టచ్ చేయలేరని కామెంట్స్ పెడుతున్నారు.





నట సింహం బాలకృష్ణ 108వ చిత్రం ప్రకటించినప్పటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఎలా చూపిస్తారనే ఆసక్తి అటు ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో ఏర్పడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంటో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
టైటిల్‌ను డిఫరెంట్ గా ప్రకటించాలని ప్లాన్ చేసిన చిత్రబృందం, రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో 108 హోర్డింగ్‌లను పెట్టి మూవీ టైటిల్ ను ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ భగవంత్ కేసరి కాదంట. ‘బ్రో ఐ డోంట్ కేర్’ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి టైటిల్ ‘బ్రో’ అని ఫిక్స్ చేశారు. దాంతో ఆ టైటిల్ ను పక్కనపెట్టి ‘భగవంత్ కేసరి’ ఫైనల్ చేశారంట.