యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన మైథాలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందనే విషయం తెలిసిందే.
హీరో ప్రభాస్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆదిపురుష్ మూవివ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మూవీ టీమ్ మీడియా ఇంటరాక్షన్స్ మరియు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్ర పోషించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి తరచు ఈ మూవీ పై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కార్టూన్ సినిమా అని ట్రోల్స్, కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై విపరీతమైన నెగటివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో మేకర్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ కారణంగానే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.
ఆ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలు కాస్త తగ్గాయి. కానీ రామాయణాన్ని తప్పుగా చూపించారని మరోసారి ఆదిపురుష్ పై వివాదం మొదలైంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఆదిపురుష్ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా చేసింది. మూవీ రిలీజ్ అయిన థియేటర్లలో ఒక్క సీట్ హనుమంతుడికి కేటాయించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆదిపురుష్ మూవీ టీమ్ మాత్రం మీడియా ఇంటరాక్షన్లు మరియు ఇంటర్వ్యూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తమ చిత్రం చుట్టూ వివాదాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లేదా ఇంటర్వ్యూలలో అడిగే కొన్ని ప్రశ్నలు వివాదానికి దారి తీస్తుండడం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. తమ మూవీకి ఎలాంటి వివాదాలు రాకుండా చేయడం కోసం ఆదిపురుష్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.
https://www.instagram.com/p/CtOFJgnJQWR/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D












నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ చిత్రం పై అందరి దృష్టి పడింది. మాస్ హీరోని అనిల్ రావిపూడి ఎలా చూపిస్తారో చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో చిత్రం పై అంచనాలను ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమా టైటిల్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందుగానే మూవీ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఫైనల్ చేసి, పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ కు ‘ఐ డోంట్ కేర్’ అనే ఉపశీర్షికను ఇచ్చారు. భగవంత్ అనగా విష్ణుమూర్తి, కేసరి అనగా సింహం’ అని అర్ధం. బాలకృష్ణకి టైటిల్ లో సింహం అని పెట్టుకునే సెంటిమెంట్ ఉంది. అందువల్లే ‘భగవంత్ కేసరి’ అని పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ చేతిలో డీఫెరెంట్ వెపన్ పట్టుకొని ఉన్నారు. అలాగే టైటిల్ లో భగవంత్ పదంలో మూడు సింహాల గుర్తు ఉంది. అంటే ఈ మూవీ కథ చట్టం, పోలీసుల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా కూడా ఉన్నారు.
విజయ్ దళపతి కొత్త సినిమాల కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో దక్షిణాది ఆడియెన్స్ అలరించిన విజయ్, ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ పెయిర్ గా పాపులర్ అయిన ఈ జంట 17 ఏళ్ల తర్వాత మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లియో చిత్రం పై హైప్ ను పెంచింది.
విజయ్ ఒక వైపు లియో మూవీ షూటింగ్ లో పాల్గోంటూనే, మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తలపతి 68’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నాడు. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన విషయాలను పజిల్స్ తో చూపించారు.
అందులో విలన్ ఎవరో క్లూ ఇచ్చారు. ఒక ట్విట్టర్ ఖాతాలో ఆ పజిల్ క్లిపింగ్ ను ఇచ్చి, విలన్ ఎవరో గెస్ చేయమని అంటే ఎక్కువగా ఎస్ జే ఎస్ అక్షరాలకు రౌండప్ చేసి ఎస్ జే సూర్య ఈమూవీలో విలన్ అని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మరియు ఎస్ జే సూర్య ఇంతకు ముందు కూడా నటించారు.







తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గరకి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగిరం చేసింది. అయితే హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు.
సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది.
ఆంజనేయుడు ఆ గాజును శ్రీ రాముడి చేతిలో పెట్టడం కూడా ట్రైలర్లలో కనిపిస్తుంది. అయితే రాముడికి సీతమ్మ ఆనవాలుగా చేతిగాజు ఇచ్చినట్టుగా చూపించారు. ఏ ఆధారాలతో ఓంరౌత్ చూడామణి కాకుండా చేతిగాజును ఈ చిత్రంలో చూపించారో మరి. ఈ మూవీ రిలీజ్ అయితే ఇంకా ఎన్ని విషయాలను ఇలా చూపించారో తెలుస్తుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. మహేష్ నటిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు మందు నెల రోజుల నుండి ఎక్కడ చూసినా ఆమూవీ గురించే వినిపించింది. నాలుగైదు టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్ గా వాటిలో నుండి ఒకటి గుంటూరు కారం పేరును మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
ఇక మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో పాటు వరుస 5 చిత్రాలను తీసుకుంటే, G అంటే గుంటూరు కారం అని, S అంటే సర్కారు వారి పాట అని, S అంటే సరిలేరు నీకెవ్వరు అని, M అంటే మహర్షి అని, B అంటే భరత్ అనే నేను అని లాస్ట్ ఐదు చిత్రాల తొలి అక్షరాలు కలిపితే GSSMB అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చేయాలి. అయితే మూవీ ప్రారంభం అవుతుండగా కేఎస్ రామారావుకు సంబంధించిన క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ సంస్థ కూడా ఈమూవీలో భాగం అయ్యింది. దాంతో మూవీ పోస్టర్ల పై రెండు ప్రొడక్షన్ హౌస్ ల పేర్లు కనిపించాయి. కొన్నేళ్ళ నుండి పెద్ద చిత్రాల ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న ఈ సంస్థ ఎందుకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. దానికి సమాధానం రాలేదు.
తాజాగా వచ్చిన భోళా శంకర్ పోస్టర్లో సిసి సంస్థ పేరు కనిపించలేదు. దానిపై మళ్లీ కొంతమంది అడిగారు. ఈ సారి ఆ నిర్మాణ సంస్థ సన్నిహితుల నుండి సమాధానం వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2 ప్రొడక్షన్ హౌస్ ల ద్వారానే చేయాలని మొదట అనుకున్నారట. కానీ ఈ సంవత్సరం క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థకు చాలా ప్రత్యేకం. బ్యానర్ పెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సినిమాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఈ ఏడాది మరో బ్యానర్‌తో కలసి ఎందుకు సినిమా చేయడం.
డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో ఈ సంవత్సరం మూవీ చేసి 50వ ఏడాదిని ప్రత్యేకం చేసుకుందామని భావించారట. అందువల్లనే ఈ మూవీ పోస్టర్లో ఆ సంస్థ పేరు కనిపించలేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ కమర్షియల్స్ కాబినేషన్ లో ఇప్పటివరకు 5 చిత్రాలు వచ్చాయి. చివరిగా 1991లో రిలీజ్ అయిన ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే మూవీని చేశారు. మళ్ళీ సినిమా చేస్తే 22 సంవత్సరాల తరువాత చేసినట్లు అవుతుంది.