బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్ కొంత కాలం క్రితం సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : నేను స్టూడెంట్ సర్
- నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని.
- నిర్మాత : నాంది సతీష్ వర్మ
- దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి
- సంగీతం : మహతి స్వర సాగర్
- విడుదల తేదీ : జూన్ 2, 2023

స్టోరీ :
సుబ్బారావు (బెల్లంకొండ గణేష్) 9 నెలలు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ఫోన్ కొనుక్కుంటాడు. ఆ ఫోన్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. సుబ్బారావు ఒక స్టూడెంట్. సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఒక చేయని నేరంలో సుబ్బారావు ఇరుక్కుంటాడు.

సాక్షాధారాలు అన్నీ కూడా సుబ్బారావుకి వ్యతిరేకంగా ఉండడంతో ఎటువైపు నుండి కూడా సుబ్బారావుకి సహాయం దొరకదు. అసలు సుబ్బారావుని ఇబ్బంది పెట్టాలని చూసినవారు ఎవరు? ఇదంతా ఎందుకు చేశారు? సుబ్బారావు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ సినిమాలో నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా చాలా కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు విడుదల అయ్యింది.

సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. సినిమా మొదలవడం మామూలుగా మొదలైనా కూడా ముందుకు వెళ్లే కొద్దీ సస్పెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక పాయింట్ తర్వాత సినిమా కథ ప్రేక్షకులకి అర్థం అయిపోతూ ఉంటుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుబ్బారావు పాత్రలో బెల్లంకొండ గణేష్ బానే నటించారు.

కానీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా కొంచెం బాగా నటిస్తే తెరపై ఆ ఎమోషన్స్ కనిపించేవి. మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. సముద్రఖని, సునీల్ వీరిని అలాంటి పాత్రల్లో మనం అంతకుముందు చూసాం. కాబట్టి పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. పాటలు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమాకి ప్రధాన బలం డైలాగ్స్. రైటర్ కళ్యాణ్ చక్రవర్తి రాసిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా అనిపిస్తాయి.

నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా స్టోరీ పాయింట్ బాగున్నా కూడా తెరపై చూపించడంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు హీరో పాత్రని పరిచయం చేయడం, అతని ప్రేమకథ అలా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉన్నా కూడా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
- సాగదీసినట్టు ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సరదాగా ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూద్దాం అనుకునే వారికి నేను స్టూడెంట్ సర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :






























తొలివలపు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ, ఆ తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్నేహకు ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో కొనసాగుతూ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు. కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని కోరుకుందని తెలిపింది. కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు వాటిని తామే ఇవ్వాల్సి వచ్చేదని, అదేం పద్దతి అని అడిగితే మేము మగవాళ్ళం అని, ఆడపిల్లలు కాబట్టి ఇంటి పనులు మీరే చేయాలని చెప్పేవారని అన్నారు. తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న టైటిల్ తో పాటుగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే మూవీ దుమ్ము లేపడం పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ బాబు మాస్ స్ట్రైక్ బాక్సాఫీస్ ని ఈసారి గట్టిగానే ఢీ కొట్టేట్టు ఉందని అంటున్నారు. గుంటూరు మిర్చి కారం ఎంత ఘాటు ఉంటుందో గ్లింప్స్ తో శాంపిల్ చూపించారు.
పోకిరి మూవీలో సిగరెట్ తాగుతూ కనిపించిన ప్రిన్స్, ఈ మూవీలో మళ్ళీ సిగరెట్ తో ఊర మాస్ గా కనిపించారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ కనిపించింది. అయితే తాజా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ ఫైట్ ఎపిసోడే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్నిఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇప్పటికి థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే తాజాగా అందుటున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్ 23 నుండి జీ5 ఓటీటీలో ప్రసారం అవనున్నట్లు తెలుస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీలో కూడా స్ట్రీమింగ్ అవనుంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ అదా శర్మ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించింది. సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. మే 5న వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో అమాయకులైన యువతులను లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి చేసి, ఆ యువతులను ఐఎస్ఐఎస్ క్యాంపుల్లోకి పంపించి టెర్రరిస్టులుగా మారుస్తున్నారనే స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
దాంతో ఈ చిత్రానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ చిత్రం పై కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ విధించగా, ఈ చిత్రం పై ఎంతోమంది కేసులు కూడా పెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అదా శర్మ ఎన్నో చిత్రాలలో నటించినా రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించింది.



