ఈ సిరీస్ కోసం 3 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు..! అసలు ఏం ఉంది ఇందులో..?

ఈ సిరీస్ కోసం 3 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు..! అసలు ఏం ఉంది ఇందులో..?

by Anudeep

Ads

2020లో ప్రసారమైన ‘అసుర్’ అనే వెబ్ సిరీస్‌ సూపర్ హిట్ అయ్యింది. హిందీ వెబ్ సిరీస్ లలో టాప్ రేటింగ్ సాధించింది. ఈ సిరీస్ తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిక రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను ప్రాచీన హిందూ చరిత్రకు ఆధునిక రూపునిస్తూ తీశారు. అత్యంత పురాతన నగరంగా పేరుగాంచిన వారణాసి బ్యాక్‌డ్రాప్ లో ఈ అసుర్ వెబ్ సిరీస్ ను రూపొందించారు.

Video Advertisement

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఈ సిరీస్ ద్వారానే ఓటీటీలోకి అడుగుపెట్టాడు. వూట్ ఓటీటీలో వచ్చిన తొలి సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను అలరించింది ఈ సిరీస్. ఇక ఇప్పుడు అసుర్ సీజన్ 2 జూన్ 1 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. తొలి సీజన్ మూడేళ్ల కిందట రాగా.. రెండో సీజన్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు.

asur web series season 2 is out now..!!

ఈ మూవీ ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో అర్షద్ వార్సీ.. ధనంజయ్ రాజ్‌పుత్ అనే సీబీఐ అధికారి పాత్రలో నటించాడు. అసుర్ అనే పాత్ర ఈ హత్యలు చేస్తుందని తెలుస్తుంది. ఈ అసురుడు ఎవరో తెలుసుకోవడానికి నిఖిల్ నాయర్ (బరుణ్ సోబ్తి) బయలుదేరుతాడు. అతను ఫోరెన్సిక్ నిపుణుడు. నిఖిల్‌కి ధనంజయ్ రాజ్‌పుత్ (అర్షద్) సహాయం కూడా అందుతుంది.

asur web series season 2 is out now..!!

వరుస హత్యలు చేసే ఆ సీరియల్ కిల్లర్ ఎవరో తొలి సీజన్ లో పూర్తిగా రివీల్ చేయలేదు. ప్రతి ఎపిసోడ్‌తో ఉత్కంఠ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ సీజన్లో డల్ మూమెంట్ లేదు. సూపర్ డ్రామా, భయంకరమైన హత్యలు కనిపిస్తాయి.చూడటానికి ఉత్కంఠభరితమైన దృశ్యాల్ని కలిగి ఉంటాయి. ఫస్ట్ సీజన్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్నాయి. ఈ సిరీస్ లో అర్షద్ తోపాటు అనుప్రియా గోయెంకా, బరుణ్ సోబ్టీ, రిద్ధి డోగ్రా, అమేయ్ వాఘ్ నటించారు.

asur web series season 2 is out now..!!

సీజన్ 1ను ఎంతో ఉత్కంఠభరితంగా ముగించడంతో రెండో సీజన్ పై ఆసక్తి మరింత పెరిగింది. రెండో సీజన్ లో ఆ కిల్లర్ ఎవరో తేలే అవకాశం ఉంది అందుకే రెండో సీజన్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అసుర్ 2 రెండు ఎపిసోడ్స్ ‘జియో సినిమాస్’ ద్వారా టెలికాస్ట్ అయింది. మిగిలిన ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం వచ్చిన రెండు ఎపిసోడ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. మొత్తం సిరీస్ చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ALSO READ : OTTలో రాబోతున్న ‘ది కేరళ స్టోరీ’..! ఎప్పటి నుండి అంటే..


End of Article

You may also like