సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్ చేసింది ఈ సినిమా. ఇక రెండో పార్ట్ ‘పుష్ప ది రూల్ ’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
‘పుష్ప ది రూల్’ కోసం అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫాన్స్ ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నారు. దీంతో పలు ఫేక్ వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా పుష్ప 2 నుంచి ఒక అప్డేట్ వైరల్ గా మారింది. పార్ట్ 1 లో పుష్పరాజ్ ప్రేయసిగా కనిపించి, చివరిలో పెళ్లి చేసుకుంటుంది శ్రీవల్లి. అయితే రెండో పార్ట్ లో శ్రీవల్లి పాత్ర చనిపోనుందని అంటూ ఒక ఫోటో వైరల్ గా మారింది.

దీంతో అందరు ఈ పుకారుని నమ్మేశారు. శ్రీవల్లిగా అలరించిన రష్మిక మందన్న పాత్ర మధ్యలోనే చనిపోతుంది అని తెలిసి ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. అయితే వైరల్ గా మారిన ఆ ఫోటో పుష్ప 2 లోది కాదని తెలుస్తోంది. అసలు ఆ ఫోటో లో ఉన్నది రష్మిక నే కాదని సమాచారం. ఇది 2022లో విడుదలైన మరాఠీ చిత్రం ‘నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచ’ నుండి వచ్చింది.

ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇందులో రష్మిక అని అందరూ అనుకుంటున్న నటి పేరు ఇషా దివేకర్. వైరల్ గా మారిన ఈ ఫోటో ని చూసి హీరోయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి ఇది కేజీఎఫ్ 2 కథలా ఉండబోతోందని పలువురు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అది కాదని తెలిసింది.

మరో వైపు వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప 2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్ అండ్ సుకుమార్ టీమ్.









మెగాస్టార్ చిరంజీవి కెరిర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో ‘పసివాడి ప్రాణం’ సినిమా ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి, హీరోయిన్ గా నటించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. కె.చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమాన హీరోలతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అప్పట్లో అభిమానులు హీరోలకు లెటర్స్ రాసేవారు. ఇక హీరోలు కూడా తమ అభిమానులకు తన సినిమాల గురించి లెటర్స్ రాసేవారు. దానికి నిదర్శనమే మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం ముందు అభిమానులకు రాసిన లెటర్. చిరంజీవి ఆ లెటర్ లో తన సినిమాల గురించి తెలిపారు.
“ప్రియమైన అభిమానులకు గీతా ఆర్ట్స్ నిర్మించిన “పసివాడి ప్రాణం” ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. డినిలో ఓ కొత్త తరహా క్యారెక్టర్ నటించాను. ఈ సినిమా పై మీ అభిప్రాయం తెలుపండి. రోజా మూవీస్ వారి చిత్రం 18-7-87న ప్రారంభమైనది. తదుపరి రిలీజ్ కాబోయే చిత్రం “స్వయంకృషి” రీరికార్డింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్, దేవి ఫిలిమ్స్ షూటింగ్స్ జరుగుతున్నవి. నా బర్త్ డే విషయం ఇంకా నిర్ణయించు కోలేదు. నిర్ణయించుకున్న తరువాత మీకు ఏ విషయం లెటర్స్ ద్వారా ముందుగా తెలుపబడుతుంది. ఈ లెటర్ తో పాటు అరవింద్ గారి “పసివాడి ప్రాణం” కలర్ స్టిల్ పంపుతున్నాను. ఉంటాను.. సదా మీ అభిమానాన్ని ఆశించే మీ చిరంజీవి” అని రాశారు.
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రజలు తమ దగ్గరున్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులలో జమ చేయడం, లేదా మార్చుకోవడం చేయాలని సూచించింది. కానీ రోజుకు ఇరవై వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు. జమ చేయడం అయితే ఎంత అయిన చేసుకోవచ్చు. ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగానే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే డిసిషన్ తీసుకన్నామన్న ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇదే విషయం పై సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతుంది. దేశంలో నోట్ల రద్దుకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలకు ముడిపెడుతు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయమ తెలిసిందే. ఈ మూవీ కోలీవుడ్ లో 2016 మార్చి 4న రిలీజ్ అయ్యింది. తెలుగులో అదే ఏడాది మే 13న విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయిన దాదాపు 5 నెలలకు పీఎం మోదీ ఇండియా లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిన్న ‘బిచ్చగాడు 2’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రోజే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయం పై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బిచ్చగాడు మూవీకి, నోట్ల రద్దు లేదా ఉపసంహరణకు సంబంధం లేకపోయినా కాకతాళీయంగా జరగడంతో నెట్టింట్లో కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ హీరో విజయ్ ఆంటోనీని బిచ్చగాడు చిత్రాలు తీయొద్దని చెప్పాలి అంటూ కామెంట్ చేశారు. మరొకరు ‘బిచ్చగాడు 3’ తీయకుండా చూసుకోండయ్యా అని కామెంట్ చేశారు.


ఎన్టీ రామరావుగారి పద్దతి వేరు. ఆయన ఏ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు అనేవి ఎదురవడం సహజమే. అలాగే ఒక సమయంలో ఎన్టీఆర్ కు కెరీర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. 1977 కి ముందు ఎన్టీఆర్ చిత్రాలు విడుదల అవుతున్నా, అంతకుముందులా హిట్ అవడం లేదు.
చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అప్పటికే ఇండస్ట్రీలోకి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి యంగ్ హీరోలు రావడంతో ఎన్టీఆర్ జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో కొందరు ఎన్టీఆర్ పనైపోయిందని కూడా అన్నారు. అయితే ఎన్టీఆర్ వయసు పై బడిందని ఊరుకోలేదు. సినీ పరిశ్రమలో తనకు ఎదురులేదని నిరూపించాడు.
నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఒకే సంవత్సరంలో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి అందరి నోళ్ళు మూయించారు. 1977లో ఎన్టీఆర్ కు 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. జనవరి 18న విడుదల అయిన ‘దానవీరశూరకర్ణ’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే.
ఈ మూవీ విజయం మరవకముందే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అడవి రాముడు’ మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం చివరలో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ మూవీ విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా ఎన్టీఆర్ 1977లో 3 చిత్రాలు చేసి రికార్డ్ సృష్టించారు.




తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కానిస్టేబుల్ శివగా నాగ చైతన్యనటించారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్‌గా నటించగా, శరత్‌కుమార్, సంపత్ రాజ్, YG మహేంద్రన్ కీలక పాత్రలలో నటించారు. శివ గర్ల్ ఫ్రెండ్ రేవతి పాత్రలో కృతి శెట్టి, ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి నటించారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు
శివ (నాగచైతన్య) నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా సీఎం దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు పొంది జిల్లాలో చాలా పాపులర్ అవుతాడు. ఓ రోజు రాత్రి పూట డ్యూటీలో చేస్తూ ఎవరో తెలియకుండానే పెద్ద క్రిమినల్ అయిన రాజు (అరవిందస్వామి) మరియు సిబిఐ ఆఫీసర్ అయిన జార్జ్ (సంపత్ రాజ్) లను అరెస్ట్ చేస్తాడు. ఆ సంఘటనతో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ లైఫ్ తలకిందులవుతుంది. రాజూ ఎవరు? అతడిని ఎందుకు సిబిఐ పట్టుకోవాలని అనుకుంటుంది? ఇందులో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ.
తాజాగా కస్టడీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఏ చిత్రం రిలీజ్ అయినా 45 రోజుల తరువాతనే ఓటీటీలోకి వస్తుంది. అంటే ఈ సినిమా మే 12న రిలీజ్ అయింది. అంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందని సమాచారం.
అయితే థియేటర్స్ లో చూడని చాలా మంది ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య చాలా చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు వచ్చే టాక్ కన్నా ఓటీటీలో విడుదల అయిన తరువాత మంచి టాక్ వస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.





