సినిమా జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. ఒక సినిమా పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిలో అంత ఈజీగా పడుతుంది. అందుకే సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉండడం కూడా ఎంతో ముఖ్యం.
అయితే కొన్ని సార్లు కథకు తగ్గ టైటిల్ ని పాత హిట్ సినిమాల నుంచి తీసుకున్నారు మేకర్స్… చాలా మంది హీరోలు పాత సినిమాల టైటిల్స్‌ను తమ సినిమాలకు పెడుతూ.. ఆయా సినిమాలపై క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు. అందులో కొంత మంది పాత సినిమాల క్లాసిక్ టైటిల్స్‌ను చెడగొట్టారు. కొందరు హిట్టు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాలేవో చూద్దాం..
#1 ఖుషి
హీరోగా పవన్ కళ్యాణ్ రేంజ్‌ను పెంచిన మూవీస్‌లో ‘ఖుషీ’ ఒకటి. ఈ సినిమా టైటిల్‌తో ఇపుడు విజయ్ దేవరకొండ, సమంత చిత్రం రాబోతోంది. ఖుషీ టైటిల్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచారు.

#2 తొలి ప్రేమ
పవన్ కళ్యాణ్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘తొలి ప్రేమ’. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పటి యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ టైటిల్‌తో పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు వరుణ్ తేజ్.. సినిమా చేసి హిట్ అందుకున్నాడు.

#3 సుల్తాన్
నందమూరి నట సింహా బాలకృష్ణ నటించిన సుల్తాన్ మూవీ టైటిల్‌తో కార్తి హీరోగా వచ్చిన ఈ మూవీ అంతగా అలరించ లేకపోయింది.

#4 బంగారు బుల్లోడు
బాలకృష్ణ పాత సూపర్ హిట్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసాదు. ఈ సినిమాతో అల్లరి నరేష్ బాక్సాఫీస్ దగ్గర మరో డిజాస్టర్‌ను అందుకున్నాడు.

#5 శ్రీమంతుడు
అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ’శ్రీమంతుడు’ సినిమాతో సక్సెస్ అందుకుంటే.. ఆ తర్వాత చాలా యేళ్లకు మహేష్ బాబు అదే టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు.

#6 స్వాతి ముత్యం
కళా తపస్వీ కే విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీ ‘స్వాతి ముత్యం’ . ఈ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ నటనను ఎవరు మరిచిపోలేరు. గతేడాది అదే ’స్వాతి ముత్యం’ టైటిల్‌తో బెల్లంకొండ సురేష్ బాబు రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా సినిమా చేసాడు.

#7 వారసుడు
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున హీరోలుగా నటించిన ’ వారసుడు’ మూవీ హిట్ అయ్యింది. ఇక తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ కూడా ‘వారసుడు’ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

#8 విక్రమ్
కమల్ హాసన్ హీరోగా నటించిన మూవీ ‘విక్రమ్’ మూవీ కూడా నాగార్జున హీరోగా నటించిన విక్రమ్ మూవీ టైటిల్ నే తీసుకున్నారు.

#9 గాడ్ ఫాదర్
ఏఎన్నార్, వినోద్ కుమార్ హీరోలుగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో గతంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా వచ్చింది. చాలా సంవత్సరాలకు అదే టైటిల్‌తో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో పలకరించారు.

#10 మహర్షి
వంశీ దర్శకత్వంలో 90 దశకంలో వచ్చిన మూవీ ‘మహర్షి’. మ్యూజికల్‌గా పెద్ద హిట్టైయిన ఈ సినిమా టైటిల్‌తో చాలా యేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

#11 సర్ధార్
80లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా సర్థార్ సినిమా తెరకెక్కింది. కార్తి మరోసారి అదే ‘సర్ధార్’ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

#12 బ్రో
అవికా గోర్ , నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బ్రో. తాజాగా ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ రాబోతుంది.

#13 ఆడవాళ్లు మీకు జోహార్లు
శర్వానంద్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఒకప్పటి కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా కే.బాలచందర్ దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో తెరకెక్కింది.

#14 శ్రీరస్తు శుభమస్తు
చిరంజీవి హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్‌తో అల్లు శిరీష్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

#15 మాస్టర్
చిరంజీవి పాత సూపర్ హిట్ ‘మాస్టర్’ టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్.

ఈ లిస్ట్ లో మిస్సమ్మ, మాయాబజార్, ఇద్దరు మిత్రులు, దొంగ, కాష్మోరా, చినబాబు, హీరో, ఖైదీ, గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి.
























దహాద్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో నటించింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా వైరల్ అవుతున్న విజయ్ వర్మ ఈ సిరీస్ లో విలన్ పాత్రలో నటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ దహాద్ లో కథ ఏమిటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే మండువా అనే చిన్న సిటీలో ఊహించని విధంగా యువతులు పబ్లిక్ టాయిలెట్స్ లో బలవన్మరణానికి పాల్పడి మరణిస్తుంటారు. ఇదే విధంగా 27 కేసులు రిజిస్టర్ అవుతాయి.
ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంజలి భాటి (సోనాక్షి సిన్హా)కి అదే సిటీలో ఒక కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్న వ్యక్తి (విజయ్ వర్మ) పై అనుమానం కలుగుతుంది. కానీ ఆమెకు ఎటువంటి ఆధారాలు లభించవు. ఇక ఈ కేసుల ఒక్కో చిక్కుముడిని సాల్వ్ చేస్తూ వెళ్లే క్రమంలో పోలీస్ ఆఫీసర్ అంజలి మరియు ఆమె కొలీగ్స్ కి విస్మయం కలిగించే అనేక విషయాలు తెలుస్తాయి. ఆ విషయలు ఏమిటి? చివరికి అంజలి హంతకుడిని ఎలా పట్టుకుంది అనేది కథ.
ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్లతో రూపొందించారు. అయితే ట్రైలర్ లోనే విలన్ ఎవరనేది చూపించారు. విలన్ తప్పించుకునే క్రమంలో హత్యలను ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
















ఫిల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లీడర్’. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి చిత్రాలను తీసిన శేఖర్ కమ్ముల సడెన్ గా పొలిటికల్ డ్రామాతో లీడర్ సినిమాను తీశారు. ఈ చిత్రంతో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించారు.
2010లో ఫిబ్రవరి 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తొలి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను వచ్చాయి. కానీ తరువాత రోజుల్లో ఎక్కువగా వసూళ్లు సాదించలేకపోయింది. ఎగ్జామ్స్ సీజన్ లో ఈ సినిమా రిలీజ్ అవడంతో బ్రేక్ ఈవెన్ చేయలేక అబౌవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. వేరే సమయంలో రిలీజ్ అయితే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉండేది. అయినా ఈ మూవీ క్లాసిక్ గా నిలిచింది. అర్జున్ ప్రసాద్ గా రానా నటన అత్యద్భుతం. మొదటి సినిమా అనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలిగించకుండా అద్భుతంగా నటించాడు.
ఈ చిత్రంలోని పాటలను వేటూరి గారు రాశారు. ఆయన రాసిన వందేమాతరం పాటఎంతో అర్ధవంతంగా ఉంటుంది. ఈ పాటలోని “చితిలోనే సీమంతం” పదానికి అర్ధం ఏమిటని ‘రంగుల రాట్నం’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చర్చ జరిగింది. అందులో భాగంగా ఇలా చెప్పుకొచ్చారు. “సాధారణంగా సీమంతం పుట్టబోయే బిడ్డ బాగుండాలని జరుపుకుంటారు. ఈ పాటలో పుట్టబోయే బిడ్డని రాబోయే తరంతో పొలుస్తున్నారని తెలిపారు. వచ్చే తరం కూడా అవినీతిలో ఉంటుందని, ఆరని రావణకాష్టంలో వచ్చే తరాలు కూడా ఆహుతు అవుతున్నాయి” అని వివరించారు.