సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలే జనాల మనసుల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, హీరో మహేష్ బాబు హీరోలుగా, మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేసారు.

సంక్రాంతి కానుకగా జనవరి 11న 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, అంజలి, సమంత పాత్రలు బాగా డిజైన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ మూవీ లో హీరోయిన్ సమంతకు ముగ్గురు చెల్లెల్లు ఉంటారు. వారిలో అందరికన్నా చిన్న చెల్లి పాత్రలో నటించింది రచన సహదేవ.

రచన పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ లో సమంత తో కలిసి అల్లరి చేసి అందరిని అలరించింది. ఈ మూవీ లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు రచన ..” ఏంటి కూలెక్కలేదా ఇంకా వాటరు..” అంటూ గోదావరి యాస లో చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో రచనకి మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

స్వతహాగా డాన్సర్ అయిన రచన ప్రస్తుతం సినిమాలకు దూరం గా ఉంటున్నారు. ఈమెకు 2019 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. రచన ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రచన ఎప్పటికప్పుడు తన ఫోటోలని, ఫ్యామిలీ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసారు రచన. అయితే ఆమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఫోటోలని చూసిన ఆమె ఫాన్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో చిన్న పిల్ల అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#1.

#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
image credits: rachana official/ instagram

కీర్తి సురేష్ ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆమె తొలి చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ చిత్రంలో కీర్తి అచ్చం మహానటి సావిత్రిలాగే నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ నుండి కీర్తి సురేష్ ని మహానటి అని పిలుస్తున్నారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి ఒక్కో సినిమాకి 2-3 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ యాబై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందంట. కీర్తి సురేష్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఒక్కో యాడ్ కి 15-30 లక్షల వరకు తీసుకుంటునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ట్రెండ్స్ మరియు జోస్ అలుక్కాస్ లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె చెన్నైమరియు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉందట. అంతేకాక ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. పెళ్లి గురించి చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 6 చిత్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేయమని కోరిందట. అలాగే ఆమె నటిస్తున్న మిగతా సినిమా మేకర్స్ ను కూడా కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. ఆమె కొత్త చిత్రాలకు అంగీకారం చెప్పట్లేదని తెలుస్తోంది. హీరో నానితో నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది
Also Read:
ఆమెకు చిన్నతనం నుండే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం నేర్చుకుని 14 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధీ దసరా మూవీ కన్నా ముందు చాలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రంలోని ‘ఓ సక్కనోడా’ పాట కూడా ఆమె పాడింది.
ధనుష్ నటించిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ను కూడా సింగర్ ధీనే పాడింది. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా మూవీలోని చమ్మీల అంగీలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండడంతో ధీ ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అని ఆన్లైన్ లో నెటిజెన్స్ వెతుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ టాలీవుడ్ లో పెరగటంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read:






శ్రీకాంత్ విదేశాలలో చదువు పూర్తి చేసి, యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల రూపాయలు వేతనం వచ్చే జాబ్ ని వదిలి, సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నటుడు మరియు డైరెక్టర్ అయిన శశి దర్శకత్వంలో వచ్చిన ‘రోజా పూలు’ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో అప్పుడప్పుడు తన కోలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నాడు. అలా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు.
అయితే కొంత కాలం నుండి శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేకపోతున్నాడు. దాంతో ఆయన కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘లై’ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించినా కలిసి రాలేదు.
దాంతో శ్రీకాంత్ సినిమాలకి ఆయన సతీమణి వందన సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో వందనకి ప్రొడక్షన్ పనుల్లో మంచి అనుభవం ఉంది. అందువల్ల వందన తన భర్త శ్రీకాంత్ సినిమాలకి సహ నిర్మాతగా ఉంటునట్లుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read: 


















