సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. అలా మన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల కథలు ఒకదానిని పోలి మరొకటి ఉంటాయి. కానీ తెరపై చూపించే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది.

ఈ విధంగా ఒకే కథ మీద వచ్చే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా, నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన ప్రేమాభిషేకం సినిమా మన అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో జయసుధ గారు, శ్రీదేవి గారు హీరోయిన్లుగా నటించారు. 1981 ఫిబ్రవరి 18వ తేదీన విడుదలైన ప్రేమాభిషేకం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోకి క్యాన్సర్ అని తెలుస్తుంది. దాంతో అది దాచిపెట్టి హీరోయిన్ కి వేరొకరిని పెళ్లి చేసుకుని ఎలా చేస్తారు.

ఇదే కథతో బాలకృష్ణ కూడా మరొక సినిమా తీశారు. కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి సింహం కూడా కథ కొంచెం ఇలాగే ఉంటుంది. కానీ అక్కడ హీరో స్థానంలో హీరోయిన్ కి క్యాన్సర్ ఉన్నట్టు చూపిస్తారు. ఈ కథని రచయిత విజయేంద్రప్రసాద్ రాశారు. ఇందులో మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలా ఒకే కథతో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.































నాగ చైతన్య తొలి చిత్రం జోష్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయింది. కానీ కార్తీక ఆ సినిమా తరువాత పెద్దగా గుర్తింపును పొందలేకపోయింది
నాగ చైతన్య రెండవ సినిమా ఏమాయ చేసావే. ఈ చిత్రంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. సమంత, నాగ చైతన్యలు 2021లో విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందే
నాగ చైతన్య నటించిన బెజవాడ మూవీతో అమలా పాల్‌ను టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.ప్రస్తుతమ ఆమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తోంది.
నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’మూవీతో మంజిమా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Also Read: