బాహుబలి తర్వాత టాలీవుడ్ ప్రతిష్ఠ అమాంతం పెరుగడంతో ఇప్పడు తెలుగు సినిమాల మార్కెట్ జాతీయస్థాయిలో ఘనంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు టాలీవుడ్ ప్రముఖ హీరో, దర్శకులు. అయితే సినీ పరిశ్రమలో కాంబినేషన్స్ అనేవి కీ రోల్ పోషిస్తాయి.
హీరో.. హీరోయిన్, హీరో .. డైరెక్టర్స్ ఇలా..కొన్ని సక్సెఫుల్ కాంబినేషన్స్ తమ ముద్రని వేస్తాయి. అయితే సరైన కాంబినేషన్ లేకపోతే సినిమా ఫలితం తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
కాకపోతే తమ హీరో.. ఈ డైరెక్టర్ తో కలిసి ఒక సినిమా తీస్తే బావుంటుంది అని కొందరు అభిమానులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పటివరకు కలిసి సినిమాలు చేయని హీరోలు, దర్శకులు ఎవరో చూద్దాం..
#1 చిరంజీవి – రాజమౌళి
ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ మూవీ తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. మన మెగాస్టార్ తో ఒక పవర్ఫుల్ మూవీ తీస్తే ఇక..అవార్డులు క్యూ కడతాయి.

#2 బాలకృష్ణ – త్రివిక్రమ్
బాలయ్యని ఇప్పటివరకు ఊర మాస్ మూవీస్ లోనే చూసాం.. అదే బాలయ్య ఒక క్లాస్ రోల్ లో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి.

#3 నాగార్జున – వి వి వినాయక్
మన కింగ్ నాగార్జున, వి వి వినాయక్ తో కలిసి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తే ఫాన్స్ కి పూనకాలే.

#4 వెంకటేష్ – కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వం లో మన వెంకీ మామ ఒక క్లాస్ మూవీ లో నటిస్తే బావుంటుంది.

#5 మహేష్ బాబు – గౌతమ్ మీనన్
వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ వస్తే అబ్బా ఊహించుకోండి. క్లాసిక్ మూవీ గా నిలిచిపోతుంది.

#6 ఎన్టీఆర్ – మణి రత్నం
క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం తో కలిసి ఎన్టీఆర్ ఒక లవ్ స్టోరీ చేస్తే సూపర్ హిట్ అసలు.

#7 రామ్ చరణ్ – శ్రీకాంత్ అడ్డాల
మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్ శ్రీకాంత్ అడ్డాల తో కలిసి తీస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఖాయం.

#8 అల్లు అర్జున్ – కృష్ణ వంశీ
ఒక పవర్ఫుల్ స్టోరీ తో అల్లు అర్జున్ – కృష్ణ వంశీ మూవీ తీస్తే థియేటర్స్ లో ఇక ఫైర్ ఏ..

#9 రజని కాంత్ – పూరి జగన్నాథ్
హీరోయిజం ని ఎలివేట్ చెయ్యడం లో పూరి జగన్నాథ్ ని కొట్టేవాడు లేడు. అలాగే హీరోయిజం లో రజని కాంత్ ని మించినోడు లేడు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం.

#10 ఎన్టీఆర్ – ప్రభుదేవా
వీళిద్దరి కాంబినేషన్ లో ఒక డాన్స్ బేస్డ్ మూవీ వస్తే థియేటర్ లో పూనకాలే.

#11 రవి తేజ – త్రివిక్రమ్
దీనినే ఊర క్లాస్ కాంబినేషన్ అంటారు …. రవి తేజ లాంటి మాస్ హీరో , త్రివిక్రమ్ స్టైల్ పంచెస్ తో ఐ ఫీస్ట్ చేస్తారు.

#12 రామ్ చరణ్ – హరీష్ శంకర్
ఫాన్స్ కి ఎం కావాలో వీరిద్దరికి తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. వీళ్లిద్దరి కంబోనషన్ లో మూవీ వస్తే ఇక పక్కా బ్లాక్ బస్టర్..


తారకరత్న జ్ఞాపకార్థంగా గుండె సమస్యలతో బాధపడే పేదవారికి వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం బసవతారకం హాస్పటల్ లో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి, దానికి తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. బసవతారకం హాస్పటల్ లో మాత్రమే కాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మిస్తున్న హాస్పటల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మంచి మనసును చాటుకున్నారని ఫ్యాన్స్ నెటిజెన్స్ నుండి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య కొడుకు తారకరత్న పైన ఉన్న ప్రేమను తెలిపేందుకు హృద్రోగ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో బాలకృష్ణ ఫోటోను కూడా షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ‘మీమీద ఉన్న కృతజ్ఞతను ఎలా చెప్పాలో, ఏమి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మీ హృదయం బంగారం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మీలా ఎవరు చేయలేరు. మీలో తండ్రిని, స్నేహితున్ని చూశాము. మీలో ఇప్పుడు దేవుడిని కూడా చూస్తున్నాం. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్న ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం, జై బాలయ్య, జై జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












కీర్తి సురేష్ ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆమె తొలి చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ చిత్రంలో కీర్తి అచ్చం మహానటి సావిత్రిలాగే నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ నుండి కీర్తి సురేష్ ని మహానటి అని పిలుస్తున్నారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి ఒక్కో సినిమాకి 2-3 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ యాబై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందంట. కీర్తి సురేష్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఒక్కో యాడ్ కి 15-30 లక్షల వరకు తీసుకుంటునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ట్రెండ్స్ మరియు జోస్ అలుక్కాస్ లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె చెన్నైమరియు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉందట. అంతేకాక ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. పెళ్లి గురించి చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 6 చిత్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేయమని కోరిందట. అలాగే ఆమె నటిస్తున్న మిగతా సినిమా మేకర్స్ ను కూడా కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. ఆమె కొత్త చిత్రాలకు అంగీకారం చెప్పట్లేదని తెలుస్తోంది. హీరో నానితో నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది
Also Read:
ఆమెకు చిన్నతనం నుండే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం నేర్చుకుని 14 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధీ దసరా మూవీ కన్నా ముందు చాలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రంలోని ‘ఓ సక్కనోడా’ పాట కూడా ఆమె పాడింది.
ధనుష్ నటించిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ను కూడా సింగర్ ధీనే పాడింది. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా మూవీలోని చమ్మీల అంగీలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండడంతో ధీ ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అని ఆన్లైన్ లో నెటిజెన్స్ వెతుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ టాలీవుడ్ లో పెరగటంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read:






శ్రీకాంత్ విదేశాలలో చదువు పూర్తి చేసి, యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల రూపాయలు వేతనం వచ్చే జాబ్ ని వదిలి, సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నటుడు మరియు డైరెక్టర్ అయిన శశి దర్శకత్వంలో వచ్చిన ‘రోజా పూలు’ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో అప్పుడప్పుడు తన కోలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నాడు. అలా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు.
అయితే కొంత కాలం నుండి శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేకపోతున్నాడు. దాంతో ఆయన కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘లై’ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించినా కలిసి రాలేదు.
దాంతో శ్రీకాంత్ సినిమాలకి ఆయన సతీమణి వందన సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో వందనకి ప్రొడక్షన్ పనుల్లో మంచి అనుభవం ఉంది. అందువల్ల వందన తన భర్త శ్రీకాంత్ సినిమాలకి సహ నిర్మాతగా ఉంటునట్లుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read: 














