అడివి శేష్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. క్షణం చిత్రం నుంచి తన పంథా మార్చుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని తన స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు. బలుపు, దొంగాట,సైజ్ జీరో వంటి సినిమాల్లో చేసినా అంత పేరు రాలేదు.
దీంతో తన విజయ పథాన్ని తానే తయారు చేసుకున్నాడు. కథలు, స్క్రీన్ ప్లే తానే రాసుకుంటూ.. క్షణం చిత్రం నుంచి తాజాగా వచ్చిన హిట్ 2 వరకు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకొని మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. కమర్షియల్ కథలు కావాలని పేచీ పెట్టడు.. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటాడు.. కొత్త కథలను కమర్షియల్‌గా చెప్పాలనుకుంటాడు.. హీరోయిన్లతో డ్యూయెట్లు అడగడు. దీంతో నిర్మాతలకు మంచి ఛాయస్ గా మారాడు శేష్.

టాలీవుడ్లో సెకండ్ టైర్ హీరోలలో నెంబర్ వన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అంతా నిన్నమొన్నటి వరకు నాని పేరు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా స్థానం మరో హీరోకు వెళ్లేలా కనిపిస్తుంది. రవితేజ లాంటి సీనియర్ హీరో ఉన్నా.. ఈ మధ్య ఫ్లాపులతో మార్కెట్ తగ్గిపోయింది. నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్, నితిన్ కూడా అంత ఫామ్‌లో లేరు. దీంతో శేష్ అనూహ్యం గా దూసుకొచ్చాడు. ఈయన సినిమాలో ఉన్నాడంటే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోతున్నారు ఆడియన్స్.

ఈ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్.. తాజాగా హిట్ 2 సినిమాతో సెకండ్ టైర్ హీరోలలో టాప్ ప్లేస్‌పై కన్నేసారు శేష్. సరికొత్త మేకింగ్‌తో.. థ్రిల్లింగ్ కథలతో హిట్ మిషన్‌గా మారిపోయారు శేష్. ఈయన దెబ్బకు మిగిలిన వాళ్లకు చెమటలు పడుతున్నాయి. మరో రెండు హిట్స్ వస్తే శేష్ మార్కెట్ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.





కానీ పూరీ జగన్నాథ్ కి తన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. అప్పట్లో ఒకసారి ‘ఆటో జానీ’ అంటూ వార్తలు వచ్చినా, ఆ తరువాత అది అక్కడే ఆగిపోయింది. మెగాస్టార్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా పూరీ చెప్పిన కథ నచ్చి సినిమా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవడంతో, పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పూరీకి భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పూరీ కెరీర్లో కోలుకోవడం చాలా కష్టం అనే మాటలు ఎక్కువ వినిపించాయి. అయితే, పూరీ జగన్నాథ్ కి ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మామూలే. తన స్కిల్‌నే నమ్ముకుని పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు.




















































































