తన నటనతో తెలుగు సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన బోర్న్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ గురించి తెలియని వాళ్ళు ఉండరు. భలే మిత్రులు సినిమా ద్వారా 1985 లో తెలుగు తెరకు పరిచయమయ్యారు రమ్య కృష్ణ.
తన కెరియర్ తొలి దశలో ఐరన్ లెగ్ లేడీగా ముద్ర పడినా…కష్టపడి తన నటన తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ స్టార్ హీరోయిన్. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి ” అల్లుడుగారు” సినిమాతో అప్పటి వరకు ఫెయిల్యూర్ బాటలో పయనిస్తున్న ఆమె కెరీర్ కు ఒక బూస్ట్ దొరికింది.
ఈ సినిమాతో తన నటన నిరూపించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రమ్య కృష్ణ తర్వాత కూడా చాలా వరకు రాఘవేంద్ర రావు గారి సినిమాలలో నటించారు. కుటుంబ ,ప్రేమ నేపథ్య చిత్రలలోనే కాకుండా దేవతా పాత్రల్లో అందరినీ అలరించారు. విల్లన్ గా, నెగటివ్ రోల్ ని కుడా రమ్య కృష్ణలాగా ఎవరు చేయలేరు. కానీ ఆమె కెరీర్ లో జరిగిన ఒక విచిత్రం గురించి చాలా మంది గమనించి ఉండరు…అది ఏమిటో తెలుసా….ఆమె ఒకే నటుడికి కూతురు,చెల్లి మరియు భార్య పాత్రలు పోషించడం. అవునండి నిజమే….ఆ నటుడు మరి ఎవరో కాదు…మంచి పవర్ ఫుల్ సపోర్ట్ పాత్రల తో పాటు మంచి విలన్ పాత్రలు కూడా పోషించిన నాజర్.
వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన బాహుబలిలో శివగామి పాత్ర లో రమ్య కృష్ణ నటించగా నాజర్ బిజ్జల దేవుడుగా ఆమె భర్త పాత్ర పోషించారు. రజనీకాంత్ నరసింహలో రమ్య కృష్ణ నాజర్ చెల్లిగా నటించి విలన్ గా అందరినీ అలరించారు.
వంత రాజవతాన్ వరువేన్ అనే తమిళ సినిమాలో ఆమె నాజర్ కూతురి పాత్ర లో నటించారు. ఇది అత్తారింటికి దారేది కి తమిళ్ రీమేక్ కాగా తెలుగు లో నదియా పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించారు.