నటీ నటులు ఫోటోలనను సోషల్ మీడియాలో షేర్ చేశారంటే అభిమానులకి పండగే. పైగా బాగా నచ్చిన హీరో, హీరోయిన్లు ఫోటోలు అయితే అభిమానాన్ని వాళ్ళు చూపిస్తూ షేర్లు, కామెంట్లు చేస్తూ ఉంటారు. చాలా మంది హీరో హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.
అలానే ఎప్పటికప్పుడు తీసుకున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఒక నటి తన చైల్డ్ హుడ్ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందంతో, అమాయకత్వంతో, అభినయంతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది ఈ భామ. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ తార.
ఆమె ఎవరో కాదు జెనీలియా. తెలుగు ప్రేక్షకులని తన నటనతో బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. బొమ్మరిలు, బాయ్స్, హ్యాపీ, సై, ఢీ, సాంబ ఇలా ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించింది. 2012లో ఈమె నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నారు. దీంతో సినిమాలకి కాస్త బ్రేక్ పడింది.