Good Luck Sakhi Review : మహానటి తర్వాత “కీర్తి సురేష్”కి మళ్ళీ అంత పెద్ద హిట్ పడ్డట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Good Luck Sakhi Review : మహానటి తర్వాత “కీర్తి సురేష్”కి మళ్ళీ అంత పెద్ద హిట్ పడ్డట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : గుడ్ లక్ సఖి
  • నటీనటులు : కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ.
  • నిర్మాత : సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్య వర్మ
  • దర్శకత్వం : నగేష్ కుకునూర్
  • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
  • విడుదల తేదీ : జనవరి 28, 2022

good luck sakhi movie review

Video Advertisement

స్టోరీ :

సఖి (కీర్తి సురేష్) కి బ్యాడ్ లక్ అని అంటూ ఉంటారు. ఊర్లో అందరూ తను వస్తే ఏదో చెడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. మరొక పక్క కల్నల్ (జగపతి బాబు) ఆర్మీ నుండి వచ్చి ఆ ఊర్లో కొంత మంది షూటర్స్ ని తయారు చేయాలి అని అనుకుంటాడు. గోలి రాజు (ఆది పినిశెట్టి) ఒక స్టేజ్ ఆర్టిస్ట్. సఖి, గోలి రాజు చిన్నప్పటినుంచి స్నేహితులు. గోలి రాజు సఖిని షూటింగ్ సెలక్షన్స్ లో పాల్గొనమని అంటాడు. సఖి అదే ఊరిలో ఉండే సూరి (రాహుల్ రామకృష్ణ)తో పాటు సెలక్షన్స్ లో సెలక్ట్ అవుతుంది. కల్నల్ సఖిని ట్రైన్ చేస్తూ ఉంటాడు. నేషనల్ లెవెల్ షూటింగ్ కాంపిటీషన్స్ కి వెళ్లిన సఖి గెలిచిందా? ఈ మధ్యలో సఖికి ఎదురైన సంఘటనలు ఏంటి? గోలి రాజుకి, సఖికి మధ్య మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? బ్యాడ్ లక్ సఖి గుడ్ లక్ సఖి ఎలా అయ్యింది? చివరికి సఖి ఏం చేసింది? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

good luck sakhi movie review

రివ్యూ :

కీర్తి సురేష్ మహానటి తర్వాత వరుసగా కొన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అందులో ఒకటి పెంగ్విన్, మరొకటి మిస్ ఇండియా. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. నితిన్ తో పాటు నటించిన రంగ్ దే సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మహానటి తర్వాత థియేటర్లలో విడుదల అయిన కీర్తి సురేష్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇదే. డైరెక్టర్ నగేష్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు పొందిన డైరెక్టర్. ఊర్లో నివసించే యువతులు, వారు ఎదుర్కొనే సమస్యలు ఇలాంటి విషయాలు అన్ని సినిమాలో బాగా చూపించారు. కీర్తి సురేష్ కూడా సఖి పాత్రలో బాగా నటించారు. ఇలా సరదాగా ఉండే పాత్రలో కీర్తి సురేష్ నటించడం చూసి చాలా రోజులు అయ్యింది.

good luck sakhi movie review

ఇంక మిగిలిన పాత్రల్లో నటించిన జగపతి బాబు, ఆది పినిశెట్టి కూడా బాగా నటించారు. కానీ సినిమా చాలా చోట్ల స్లోగా అనిపిస్తుంది. చాలా మంచి సీన్స్ కూడా సాధారణంగా తీశారు అనిపిస్తుంది. ఒకవేళ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఆ సీన్స్ తెరపై చాలా బాగా కనిపించేవి. డబ్బింగ్ కూడా సరిగ్గా లేదు. కొన్ని చోట్ల డైలాగులు కూడా అర్థం అవ్వవు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు. కానీ సంగీతం కూడా సినిమాకి అంత సహాయపడలేదు. చాలా లోపాలు ప్రేక్షకులకి అర్థమైపోతుంటాయి.

ప్లస్ పాయింట్స్ :

  • కీర్తి సురేష్
  • పాటలు
  • ఊరి నేటివిటీని చూపించిన విధానం

మైనస్ పాయింట్స్:

  • అర్ధమైపోయే స్టోరీ
  • స్లోగా నడిచే స్క్రీన్ ప్లే
  • బలహీనమైన డబ్బింగ్

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

ఏమి అంచనాలు పెట్టుకోకుండా, లాజిక్స్ ఎక్కువగా వెతక్కుండా టైంపాస్ కి ఒక సినిమా చూద్దాం అనుకుంటే అయితే గుడ్ లక్ సఖి ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.


End of Article

You may also like