పుష్ప సినిమా అల్లు అర్జున్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. పైగా యాక్టింగ్ అయితే ఎంతో అద్భుతంగా వుంది. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా సినిమా. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన సినిమా పుష్ప.
అల వైకుంఠపురంలో తర్వాత మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని బన్నీకి తీసుకొచ్చింది. డిసెంబర్ 17 న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో పాటలు, డైలాగ్స్ సైతం అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా మావ..’ పాట గురించి చెప్పుకునే తీరాలి. ఈ పాటకి సమంత డాన్స్ తో కుమ్మేసింది.
కేవలం ఇక్కడ సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అటు నార్త్ ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్ సినిమాలకు సైతం ధీటుగా వసూళ్లను రాబడుతోంది. చాలా మంది సెలబ్రెటీలు ఇప్పటికే ‘ఊ అంటావా మావ..’ అంటూ స్టెప్పులు వేశారు. తాజాగా అమెరికన్ డాన్సింగ్ డాడ్ రికీ పాండ్ కూడా చిందులేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ స్టెప్పులు వేసి రికీ పాండ్ బాగా ఆకట్టుకున్నారు. ఇది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. భారతీయ పాటలకు స్టెప్పులేసి వీడియోని పోస్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో చూసిన వాళ్లందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్ తో పాటు ఎంతో మంది హృదయాలను కూడా గెలుచుకుంది. పెద్ద పెద్ద స్టార్స్, క్రికెటర్లు సైతం ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు.
https://www.instagram.com/reel/CYS0RYHB_Cg/?utm_source=ig_embed&ig_rid=4b12adb1-028b-4861-a158-9d585606058f