ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ ప్రోమో రిలీజ్ అయింది. ఇది ఓ రేంజ్ లో ఉండి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో ఈ విషయం గమనించారా..?
Also Read: ఇదెక్కడి ఎడిటింగ్ రా మావా.. “పుష్ప” లో అనసూయని ఇలా ఎడిట్ చేశారేంటి..?
రష్మిక అడవిలోనే బండి నడుపుతూ ఉంటుంది. వెనకాల మరో ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు. వెనకాల కూర్చున్న అమ్మాయిని ఎవరో గుర్తు పట్టారా..? ఆమె ఎవరో కాదు దివ్య శ్రీపాద. యు ట్యూబ్ లో గర్ల్ ఫార్ములా లో వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య శ్రీపాద కలర్ ఫోటో సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్ చేసింది. తాజాగా.. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో అవకాశము కొట్టేసింది. నిజంగా కష్టపడితే సక్సెస్ తప్పకుండ వస్తుంది అనడానికి ఆమె ఓ ఉదాహరణ.