సుమ కనకాల పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా తను ఒక మహోన్నత శిఖరం. ఇక రాజీవ్ కనకాల గురించి చెప్పనే అక్కర్లేదు అతను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరికీ ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు రోషన్ ని బబుల్ గమ్ సినిమా ద్వారా హీరోగా ఈ మధ్యనే పరిచయం చేశారు ఈ దంపతులు. ఇక అసలు విషయానికి వస్తే ఈ దంపతులు తమ 25 సంవత్సరాల వివాహ వేడుకను ఈ మధ్యనే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ సెలబ్రేషన్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా అయ్యాయి.



ఎందుకంటే ఈ జంట పెళ్లిరోజు వేడుకలని హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు ఆశ్రమంలోని వృద్ధులకు ఆహారం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వృద్ధులతో ముచ్చటించారు ఈ దంపతులు. వారితో పాటు వారి పిల్లలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను చూసిన సుమ మరియు రాజీవ్ అభిమానులు ఆ జంటను ప్రశంసిస్తున్నారు.




ఇక సుమ విషయానికి వస్తే తను పుట్టుకతో మలయాళీ అమ్మాయి కానీ తండ్రి ఉద్యోగరీత్యా ఆమె హైదరాబాద్ లో స్థిరపడింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజీవ్ తో అయిన పరిచయం తర్వాత వారిద్దరి పెళ్ళికి దారితీసింది. వీరిద్దరిది ఎంతో అన్యోన్య దాంపత్యం అయినప్పటికీ ఎన్నోసార్లు ప్రేక్షకులు వీళ్ళిద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని, డైవర్స్ అయిపోయాయని రూమర్లు పుట్టిస్తూనే ఉన్నారు.



అలా రూమర్లు వచ్చిన ప్రతిసారి వారి కాపురం బలంగా ఉందని, కలిసి ఉన్న మమ్మల్ని విడదీయొద్దు అంటూ దంపతులు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకునేవారు. ఎన్నిసార్లు వాళ్ళిద్దరూ కలిసి మేము కలిసే ఉన్నాము అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎందుకో వాళ్ళ విడాకులు టాపిక్ ఎప్పుడూ హైలెట్ గానే ఉంటూ వచ్చింది. అలాగే 25 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా లైఫ్ జర్నీ చేసిన ఈ జంట మరిన్ని పెళ్లి రోజులు ఆనందకరంగా జరుపుకోవాలని ఆశిద్దాం.


























శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.