మొదటి వారం వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ లో దుమ్ము దులిపేసిన సందీప్ కిషన్ సినిమా ఊరి పేరు భైరవకోన. వీక్ డేస్ వచ్చిన తర్వాత స్పీడ్ తగ్గినా కుడా బానే ఆడుతుంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన సినిమాకి స్టార్టింగ్ నుంచి మంచి హైప్ ఉంది. ఈ సినిమాలో పాటలు, మ్యూజిక్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా పాటలు గత ఆరునెలల నుంచి ట్రెండింగ్ లోనే ఉన్నాయి.ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అనుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ కూడా అందరికీ తెగ నచ్చేసి థియేటర్ల వద్దకు దూసుకుని వెళ్తున్నారు ప్రేక్షకులు. కిందటి శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు వీకెండ్ కలెక్షన్లు బానే వచ్చాయి. వీక్ డేస్ లో కొంచెం ఊపు తగ్గినా కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లోనే ఉంది ఈ సినిమా.
నాలుగో రోజు 55 లక్షల రేంజ్ లో షేర్ ని, ఐదో రోజు 41 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇదే రేంజ్ లో కంటిన్యూ అయ్యి రెండో వారంలో కూడా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయితే ఈజీగా బ్రేక్ ఈవెన్ ఐపోయి క్లీన్ హిట్ గా నిలుస్తుంది ఈ సినిమా. వచ్చేవారం మంచి పేరున్న సినిమాలు ఎక్కువ రిలీజ్ కి లేకపోవడంతో, ఈ సినిమా బ్రేకింగ్ అవడానికి ఛాన్సులు బానే ఉన్నాయి.
ఈ సినిమా ఐదు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లలోకి వస్తే నైజాంలో 2.81 కోట్లు, ఏపీ మొత్తంలో 2.92 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంలో 6.36 కోట్లు (11.90 కోట్ల గ్రాస్) తో వరల్డ్ వైడ్ గా మొత్తం 8.33 కోట్లు(16.20 కోట్ల గ్రాస్) సంపాదించింది ఈ చిత్రం. 11 కోట్లతో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 2.67 కోట్ల రేంజ్ లో షేర్ నీ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.






