భాస్కర్ దర్శకత్వం లో సిద్ధార్థ్ హీరో గా వచ్చిన “బొమ్మరిల్లు” మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తండ్రి కొడుకుల రిలేషన్ ను కొత్తగా చూపించడంతో ఈ సినిమా బాగా హిట్ అయింది. ఈ సినిమాతో దర్శకుడు భాస్కర్ పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.
అయితే.. ఈ సినిమాకు కథను ఓ పుస్తకం నుంచి తీసుకున్నారట. ‘ఆమెలో ఏముంది’ అనే బుక్ నుంచి ఈ కథను తీసుకున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ బుక్ రచయిత కూడా దర్శకుడిపై కేసు వేసినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాక మళ్ళీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాను కూడా పాత తరహాలోనే తీశారు, గతం లో ఉన్న సన్నివేశాలే మళ్ళీ ఉన్నట్లు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.