విధు వినోద్ చోప్రా 12 ఫెయిల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఆపై డిసెంబర్ 29న ఓటీటీ లో ప్రారంభం అయింది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా ధియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం కలిసి వేడుక చేసుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వంద రోజులు వెనక్కి వెళితే ఆరోజు మా సినిమా మొదటిసారి స్క్రీనింగ్ వేసాం. అందరూ 100 కోట్లు 1000 కోట్లు కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ఇలాంటి రోజులలోనీ సినిమాలో ఎలాంటి విషయం ఉంది,అసలు ఈ సినిమా విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇలాంటి సినిమాలు తీశావు అంటూ నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆపై నిజాయితీతో సినిమా తీస్తే కలెక్షన్లు అవే వస్తాయి అని ధైర్యం చేశాను. నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు నా భార్యతో సహా అందరూ దీనిని ఓటీటీ లో విడుదల చేయాలని సలహా ఇచ్చారు.
విక్రాంత్,నువ్వు కలిసి చేసిన ఈ సినిమాను ఎవరూ చూడరు వినోద్ ఇలాంటి సినిమాలుకు నేను కలెక్ట్ కాలేను ఓపెనింగ్ కలెక్షన్లు వస్తే రెండు లక్షలు రావచ్చు మొత్తం 30 లక్షలు వస్తే గొప్పే అంటూ అందరూ నన్ను భయపెట్టారు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకు మార్కెటింగ్ ప్రచారం చేశాను. విడుదలైనప్పుడు నెమ్మదిగా పాజిటివ్ టాక్ వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు వినోద్. అయితే 12 ఫెయిల్ విషయంలో తన అంచనా తప్పయిందని అందరి ముందు అంగీకరిస్తున్నాను అంటూ వినోద్ చోప్రా సతీమణి అనుపమ చోప్రా తెలియజేశారు. ఈ సినిమాని 20 కోట్లతో నిర్మిస్తే 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.














ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ మూవీకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ‘తొలి ప్రేమ’ అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్‌లకు ఈ మూవీతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. వీరితో పాటుగా హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన కుసుమ డెగల మర్రికి గుర్తింపు దక్కింది. ఇలా ఈ మూవీలో నటించిన వారందరికీ బేబీ మూవీ ఊహించనంత గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే అందరూ ఆ బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే కాకుండా హీరోయిన్ కాలేజీ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పేరే ‘కిర్రాక్ సీత’. ఇప్పటికే ఆమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. తెలుగు వెబ్ సిరీస్‌లలో నటించింది. షార్ట్ ఫిల్మ్‌లు ద్వారా సీత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 21 వెడ్స్ 30, పెళ్లికూతురు పార్టీ, సరయు, మూడు చేపల కథ వంటి వాటిలో నటించి ఆకట్టుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.
కుమారీ ఆంటీ ట్రెండింగ్ లోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా అందరు స్ట్రీట్ ఫుడ్స్ మీదే దృష్టి పెట్టారు. కుమారీ ఆంటీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు ముఖ్యమంత్రి వస్తారని వార్తలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగులు కుమారీ ఆంటీ స్టాల్ కు వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ కుమారీ ఆంటీ వంటి వారిని వెతికి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కుమారీ ఆంటీ గురించి, నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పూర్తి పేరు సాయి కుమారి. గత పదమూడు సంవత్సరాలుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాల్ పెట్టకముందు సింగర్ హేమ చంద్ర ఇంట్లో పని చేసేవారంట. ఆ తరువాత ఫుడ్ స్టాల్ మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆలీ లాంటి సెలెబ్రెటీలు సైతం కూరలు తీసుకెళ్తారని కుమారీ ఆంటీ వెల్లడించారు.
రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి భోజనం తిని వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ తిన్న తరువాత సందీప్ కిషన్ కుమారీ ఆంటీకి పదివేల రూపాయలు ఇచ్చారట. కుమారీ ఆంటీకి ఇంతగా క్రేజ్రావడంతో బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకుంటారేమో అంటూ నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు.






