సినీ సెలబ్రెటీల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఉపయోగించే వస్తువుల నుండి వారింట్లో పెంచుకునే జంతువుల వరకు అన్నీ ఖరిదైనవే ఉంటాయి. వారింట్లో పనిచేసేవారి వేతనాలు కూడా భారీగానే ఉంటాయి.
సెలెబ్రెటీల గురించిన పర్సనల్ విషయాలు నెట్టింట్లో క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె కేర్ టేకర్ జీతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో? ఆమె జీతం ఎంతో ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి, తాజాగా చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read: 50 కి దగ్గరగా ఉన్నా…పెళ్లి చేసుకోని 10 మంది హీరోయిన్స్.! ఒకొక్కరికి ఒకో కారణం.!









కథ:














ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.
