దర్శకధీరుడు రాజమౌళి తీసిన చిత్రం బాహుబలి. దీంతో ప్రాంతీయ చిత్రాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. అయితే పక్క భాషలో క్రేజ్ ఉన్న హీరోతో సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని దర్శకులు భావించడం .. అలాగే పక్క రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చు అని హీరోలు అనుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ ఇలా ట్రై చేసి కొంతమంది హీరోలు ప్లాప్ లు మూటగట్టుకున్నారు.
ఇప్పుడా సినిమాలు, వాటి దర్శకులు ఎవరో చూద్దాం..
#1 ఎస్ జె సూర్య
ఖుషి సినిమాతో మొదటిసారిగా జత కట్టిన పవన్ , ఎస్ జె సూర్య ‘కొమరం పులి’ సినిమాతో ప్రేక్షకులని బాగా నిరాశపరిచాడు.
#2 ఏ ఆర్ మురుగదాస్
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది.
#3 లింగుస్వామి
ఈ కోలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్ హీరో రామ్ తో ‘ది వారియర్’ అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
#4 పుష్కర్ గాయత్రి
ఈ తమిళ డైరెక్టర్ ‘విక్రమ్ వేద’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీసుకెళ్లి హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లతో రీమేక్ చేసింది. ఈ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది.
#5 అనుదీప్
ఈ టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి అతనికి ప్లాప్ ఇచ్చాడు.
#6 గౌతమ్ వాసుదేవ్ మీనన్
నాగ చైతన్య కి ‘సాహసం శ్వాసగా సాగిపో’ , నానికి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ వంటి ప్లాప్ లు ఇచ్చాడు ఈ తమిళ దర్శకుడు.
#7 తిరు
ఈ తమిళ దర్శకుడు గోపీచంద్ తో ‘చాణక్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు.
#8 శైలేష్ కొలను
ఈ టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ తో ‘హిట్’ చిత్రాన్ని రీమేక్ చేశాడు. ఇది అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
#9 గౌతమ్ తిన్ననూరి
ఈ టాలీవుడ్ డైరెక్టర్ ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేశాడు. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
#10 సి.ప్రేమ్ కుమార్
తమిళంలో ’96’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి.. అదే చిత్రాన్ని తెలుగులో శర్వానంద్ తో రీమేక్ చేసి పెద్ద ప్లాప్ ఇచ్చాడు.
#11 ధరణి
ఈ తమిళ దర్శకుడు పవన్ తో ‘బంగారం’ సినిమా చేసాడు.
#12 శరవణన్
రాంతో ‘గణేష్’ చిత్రం చేసిన ఈ దర్శకుడు ప్లాప్ ఇచ్చారు.
#13 విష్ణువర్ధన్
పంజా మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ మంచి ఫిలింమేకర్ ఏ కానీ ఎందుకో ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
#14 పి. వాసు
తమిళ్, మలయాళం లో ఎన్నో హిట్స్ ఇచ్చిన పి. వాసు గారు తెలుగు లో మహారథి, నాగవల్లి మూవీస్ తో అట్టర్ ఫ్లోప్స్ తీశారు.