ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించడానికి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అయితే తర్వాత వచ్చిన బాలకృష్ణ రావడంతోటే అక్కడ పెట్టిన ఎన్టీఆర్ బ్యానర్లను తీసేయమని పక్కన ఉన్న సిబ్బందితో చెప్పారు.
వెంటనే సిబ్బంది ఆ బ్యానర్లను తొలగించారు.ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణను నిందిస్తూ నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు బాలయ్యకి ఎన్టీఆర్ కి పడటం లేదని అందుకే బాలయ్య ఇలా బ్యానర్ లు తీయించేసారని రాసుకోచ్చారు. అయితే బాలయ్య బ్యానర్లు తీసేయమనడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. అక్కడ జరుగుతుంది సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. కానీ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన బ్యానర్లు దానికి సంబంధం లేకుండా ఉన్నాయి. వర్ధంతి కార్యక్రమమైతే స్వాగతం సుస్వాగతం బ్యానర్లు పెట్టారు.

కార్యక్రమానికి సంబంధాలు లేకుండా బ్యానర్లు పెట్టడంతో కోపం వచ్చిన బాలయ్య ఆ బ్యానర్లు తీసేయమని చెప్పారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య మధ్య ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పలువురి నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు





సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ, మొదటి నుండి ఆటంకాలు, ఆ తరువాత హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం, పలు రకాల ప్రచారాలు వచ్చాయి. ఓ దశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
ఆ సినిమా కాపీ అంటూ కొందరు, ఆ నవల కాపీ అంటూ మరికొందరు నెట్టింట్లో ఈ మూవీ పై విమర్శలు చేశారు. థియేటర్ల విషయంలోనూ వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి విమర్శల మధ్యనే మూవీ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో నెగెటివిటీ మొదలైంది. బుక్ మై షో యాప్ లో మూవీ రిలీజ్ కాకముందే 70 వేల మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే మహేష్ బాబు వల్లే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.
తాజాగా రవితేజ నటించిన దరువు మూవీలోని సీన్ ను త్రివిక్రమ్ కాపీ చేశారని, అదే సీన్ ను గుంటూరుకారంలో మహేష్ బాబుతో చేశారంటూ దరువు సీన్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నిజమే అంటుండగా, కొందరు అదేం కాదని అంటున్నారు.
సంగీత దర్శకులు తమ సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలు పడడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్పీ పట్నాయక్ మాత్రం సినిమాలోని అన్ని పాటలు ఆయనే పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్పీ లాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చాలా సినిమాలలో మొత్తం పాటలు పాడారు. అయితే టాలీవుడ్ లో ఈ సినిమా కోసం తెలుగు టాప్ 10 సంగీత దర్శకులు కలిసి ఒక పాటను పాడారు. ఆ సినిమా పేరు అందమైన మనసులో.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత, ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వైపుకు వెళ్లారు. అలా 2008 లో మొదటి సారిగా ‘అందమైన మనసులో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజీవ్, రమ్య నంబీషన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని “అమ్మాయి నవ్వింది.. అబ్బాయికి నచ్చింది” అనే పాటను పది మంది ప్రముఖ సంగీత దర్శకులు ఆలపించారు.
ఈ పాటను ఆలపించిన వారిలో ఆస్కార్ గ్రహీత ఎం ఎం కిరవాణి, రాజ్, కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్, ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, చక్రి, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ ఉన్నారు. పది మంది అగ్ర సంగీత దర్శకులు కలిసి పాడటం అనేది ప్రత్యేకమైనది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పాడటం అరుదైన విషయం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి పాట తెలుగులో రాదేమో. ఈ పాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా జో. ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని విజన్ సినిమా హౌస్ బ్యానర్ పై నిర్మించారు. సిద్ధు కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 2023 లో నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనవరి 15 నుండి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబానికి ఏకైక వారసుడు జో (రియో రాజ్), చిన్నతనం నుండి జోకి ఐదుగురు మిత్రులు ఉంటారు. ఎక్కడికి అయినా ఆ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. జోకాలేజీలో, తన క్లాస్మేట్ గా కొత్తగా సుచి (మాళవిక మనోజ్) జాయిన్ అవుతుంది. కేరళకు చెందిన సుచి సెన్సిటివ్, మృదుస్వభావి కావడంతో ఆమెను ఇష్టపడతాడు. ఆమెను వేధిస్తున్న సీనియర్ నుండి సేవ్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి ఆమధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
అయితే సుచి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. విషయం తెలిసిన సుచి ‘జో’ కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, తన తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెబుతుంది. దాంతో ‘జో’ సుచి ఇంటికి వెళతాడు. వారి ప్రేమ గురించి తల్లిదండ్రులతో ప్రేమ, పెళ్లి గురించి ప్రయత్నిస్తాడు. కానీ వారి బంధువులు ‘జో’ ను కొడతారు. అది గోడవగా మారుతుంది. ఆ క్రమంలో సుచి తండ్రి క్రింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుచి జో పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జో చెప్పేది వినకుండా తనను ఇక మీదట కలవవద్దని చెప్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
