ఊరగాయ అనగానే ముందు గుర్తొచ్చేది ఆవకాయ, మాగాయ. వేసవి కాలంలో దొరికే పచ్చి పుల్లని మామిడికాయలతో కొత్త ఆవకాయ పెట్టుకోవడం అనేది ప్రతి తెలుగింటి లోగిలికీ ఆనవాయితీ. అయితే.. వేడి వేడి అన్నంలో ఈ ఊరగాయలు వేసుకుని కలుపుకుని తింటే ఆ రుచికి ఎవరైనా మైమర్చిపోవాల్సిందే.
అయితే.. అతిగా తినడం ఎప్పుడూ అనర్ధాలకు దారి తీస్తుంది. ఈ ఊరగాయలు వేసవి కాలంలో పెట్టుకుంటే.. సంవత్సరమంతా సీజన్ తో సంబంధం లేకుండా తినేస్తూ ఉంటాము. అయితే.. ఊరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన పురుషులకు హాని కలుగుతుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు.
ఇవి టేస్టీగా స్పైసిగా ఉంటాయి కాబట్టి తెగ తినేస్తూ ఉంటాం. సాధారణంగా ఎక్కువగా పచ్చళ్ళను, ఊరగాయలు తింటూ ఉంటె వేడి చేస్తుంది. అయితే ముఖ్యంగా పురుషులు వీటిని ఎక్కువగా తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా పురుషులు ఊరగాయలు తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ ఊరగాయలు తినడం వలన గ్యాస్ట్రిక్ కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉప్పు శాతం కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి దీనివలన అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా రక్తపోటు రోగులు ఊరగాయలు ఎక్కువగా తినకూడదు. ఇంకా.. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కూడా అతిగా ఊరగాయ తినడం ఓ కారణం. ఎక్కువగా ఊరగాయలు తినడం లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన లైంగిక ఆరోగ్యంపై ప్రభావము పడుతుంది. ఊరగాయలలో ఆస్టామిప్రిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించడమే కాకుండా.. వీర్యం, వీర్య నాణ్యతని కూడా తగ్గిస్తుంది. అందుకే ఊరగాయలను పురుషులు తక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. ఊరగాయ రుచిగా రావడం కోసం ఎక్కువగా నూనెను ఉపయోగిస్తారు. దీనివల్ల కొలెస్టిరాల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఊరగాయను వీలైనంత తక్కువగానే తీసుకోవాలి.